Bigboss Ashwini Sree: పవన్ కళ్యాణ్ నా వాడే అంటున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ !

పవన్ కళ్యాణ్ నా వాడే అంటున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ !

Bigboss Ashwini Sree: బిగ్​ బాస్ తెలుగు సీజన్‌-7లో వైల్డ్‌ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీని తెచ్చుకున్న కంటెస్టెంట్ అశ్విని శ్రీ. బిగ్ బాస్(Big Boss-7) తెలుగు సీజన్ 7 లో 5 వ వారంలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన గ్లామర్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బిగ్‌ బాస్‌ షోలో టాస్క్‌ల పరంగా పెద్దగా మెప్పించకపోయినప్పటికీ తన అందాలతో ఎనలేని క్రేజ్‌ తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్‌ లో భోలే షావళితో మంచి పెయిర్‌గా తన ఆటను కొనసాగించిన ఈ బ్యూటీ 12వ వారంలో ఎలిమినేట్‌ అయింది.

అయితే ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విని… పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్​ చేసింది. గబ్బర్‌ సింగ్‌ సినిమాలో శృతిహాసన్ స్నేహితురాలిగా నటించిన సమయంలో పవన్‌ తో తనుకున్న అనుబంధాన్ని ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. పవన్ కల్యాణ్ ఎప్పుడూ నా వాడే… సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న OG సినిమా సూపర్ డూపర్ హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పింది. ప్రస్తుతం అశ్విని శ్రీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Bigboss Ashwini Sree Comments Viral

పవన్ కళ్యాణ్‌ను మళ్లీ కలిసే అవకాశం వస్తే మీ రియాక్షన్ ఏంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు అశ్విని శ్రీ(Ashwini Sree) స్పందిస్తూ… ‘ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్‌ కళ్యాణ్ తో దాదాపు 3 నెలలు జర్నీ చేశాను. షూటింగ్ సమయంలో పక్కన కూర్చొపెట్టుకుని పవన్‌ సార్‌ మాట్లాడేవారు. సెట్స్‌లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్​ తింటున్న డ్రై ఫ్రూట్స్, తినమ్మా అంటూ నాకు ఇచ్చేవారు. ఆయనకి ఎప్పుడైనా బోర్ కొడితే నన్నే పిలిచేవారు. ఆపై మాతో పాటలు, డ్యాన్స్‌ చేపిస్తూ సరదాగా ఉంటారు. అందుకే పవన్‌ అంటే ఇష్టం. ఆయన నేను క్యారివాన్‌లో ఉండేవాళ్లం. షూటింగ్‌ కి రోజులో ఒక్కోసారి మాత్రమే పిలిచేవారు. మిగిలిన టైం అంతా క్యారివాన్‌లోనే ఉండేదాన్ని.

ఆయనపై ఉన్న ఇష్టం మాటల్లో చెప్పలేను. సంథింగ్ ఆయనలో ఏదో ఉంటుంది. గబ్బర్ సింగ్ టైంలో సార్‌తో షూటింగ్ చేసి ఇంటికెళ్లి పడుకున్న తర్వాత ఆయన నాకు కలలోకి వచ్చేవారు. ఆయనతో షూటింగ్ చేస్తున్నట్టుగానే డ్రీమ్స్ వచ్చేవి. ఆయనతో ఎక్కడికో వెళ్లినట్టుగా పిచ్చి పిచ్చి కలలు వచ్చేవి. సార్ నన్ను మర్చిపోయి ఉంటారు కానీ.. నేను ఎప్పటికీ మర్చిపోలేని అనూభూతులు ఆయనతో ఉన్నాయి.’అని ఆమె చెప్పింది. పవన్‌ కళ్యాణ్ పై అశ్విని శ్రీ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. గబ్బర్‌ సింగ్‌ తో పాటు రాజా ది గ్రేట్‌ వంటి చిత్రాల్లో నటించినా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే ఇప్పుడు బిగ్‌ బాస్‌ వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి అశ్విని శ్రీ.

Also Read : Mammootty: ఆశక్తికరంగా మమ్ముట్టి ‘భ్రమయుగం’ టీజర్‌ !

Ashwini SreeBigboss
Comments (0)
Add Comment