Big Boss Faima : ఓ స్టాండప్ కామెడీ షోలో తన ప్రతిభని నిరూపించుకుని… ఆ తరువాత ‘జబర్దస్త్’లో అడుగుపెట్టి… వెనువెంటనే బిగ్‌బాస్ హౌస్ లో అడుపెట్టిన కమెడియన్ ఫైమా. కమెడియన్ గా, బిగ్ బాస్(Big Boss) కంటెస్టెంట్ గా ప్రేక్షకుల మనసులకు దగ్గరవడంతో పాటు ఇటీవల వరుస డ్యాన్స్ షోలలో కనిపిస్తూ తనలో మరిన్ని టాలెంట్స్ ఉన్నాయని నిరూపిస్తోంది. అయితే ఈమె ఒక్కసారిగా హాస్పిటల్ బెడ్ కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది. సిబ్బంది ఆమె చేతి నుండి బ్లడ్ శాంపిల్ తీసి, సెలైన్ బాటిల్స్ ఎక్కించడంతో ఫైమాకు ఏం జరిగింది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Big Boss Faima – సోషల్ మీడియాలో వైరల్ గా మారిన హాస్పిట్ బెడ్ పై పడుకుని ఉన్న ఫైమా ఫోటో
ఫైమాకు ఏం జరిగిందో చెప్పలేదు కాని… ఆమె హాస్పిటల్ లో చేరిన వీడియోను రీల్ చేసి ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. వర్షించే మేఘంలా నేనున్నా… అనే పాటను యాడ్ చేసి… హాస్పిటల్ లో చేరడం, సిబ్బంది బ్లడ్ శాంపిల్స్ తీయడం, సెలైన్ బాటిల్ ఎక్కించడం అన్నీ ఈ వీడియోలో ఉండటంతో ఫైమా నిజంగానే అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఫైమా… ఒక్కసారిగా హాస్పిటల్ బెడ్ పై కనిపించడంతో కొంతమంది అభిమానులు ఆందోళనకు గురై… గెట్ వెల్ సూన్ అంటూ మెసేజ్ లు పెడుతున్నారు. కాని ఆమె అసలెందుకు హాస్పిటల్ లో చేరింది అనే కారణం మాత్రం చెప్పలేదు.
జబర్ధస్త్ టూ బిగ్ బాస్ హౌస్
నిరు పేద కుటుంబానికి చెందిన ఫైమా.. తొలుత స్టాండప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘జబర్దస్త్’లో అవకాశం దక్కించుకుంది. తనదైన మేనరిజమ్, టైమింగ్ తో అలా బిగ్‌బాస్, డ్యాన్స్ షోలో పాల్గొని తనలోని మరిన్ని టాలెంట్స్ ఉన్నాయని బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె మళ్లీ ‘జబర్దస్త్’లో భాస్కర్ టీమ్‌లో చేస్తోంది.
Also Read : Bobby Deol: ‘యానిమల్’ కోసం బాబీ డియోల్ త్యాగం