Big Boss Beauties: త్వరలో పెళ్ళి పీటలెక్కున్న బిగ్ బాస్ బ్యూటీస్ ప్రియాంక, శోభా !

త్వరలో పెళ్ళి పీటలెక్కున్న బిగ్ బాస్ బ్యూటీస్ ప్రియాంక, శోభా !

Big Boss: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్‌ ప్రియాంక జైన్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే మూడు ముళ్లబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పింది. గత కొన్నేళ్లుగా నటుడు శివకుమార్‌తో ప్రేమలో వస్తున్న వార్తలను ఆమె ఇటీవల బిగ్‌బాస్‌ హౌస్‌లో ధ్రువీకరించింది. అంతేకాదు, అతడు బిగ్ బాస్ హౌస్‌లోకి రాగానే పెళ్లెప్పుడు చేసుకుందాం.. బిగ్‌బాస్‌ అయిపోగానే భార్యాభర్తలుగా కొత్త జర్నీ మొదలుపెడదాం అంటూ ఎమోషనలైంది. మరోవైపు శివకుమార్‌ సైతం.. ప్రియురాలిని ముద్దులతో ముంచెత్తి ఆప్యాయంగా హత్తుకున్నాడు. బిగ్‌బాస్‌ 7(Big Boss-7)లో టాప్‌ 5కి చేరుకున్న ప్రియాంక తాజాగా తన పెళ్లి గురించి యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌డేట్‌ ఇచ్చింది. వచ్చే ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. త్వరలోనే మూహూర్తం ఫిక్స్‌ చేసి ఆ పెళ్లి తేదీ కూడా సోషల్‌ మీడియాలో వెల్లడిస్తామని తెలిపింది. అలాగే తన పెళ్లి గురించి చాలా ఆలోచనలు ఉన్నాయని, అవన్నీ మరో వీడియోలో చెప్తానంది.

Big Boss – శోభా పెళ్లి కూడా అప్పుడే!

ఇకపోతే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఓ టాస్క్‌లో భాగంగా తన జుట్టు కత్తిరించుకున్న ప్రియాంక… తన హెయిర్‌ ఇంకాస్త పొడుగ్గా అయిన తర్వాతే వివాహం చేసుకుంటానంది. పనిలో పనిగా మరో సీక్రెట్‌ కూడా బయటపెట్టింది. తన బెస్ట్‌ ఫ్రెండ్‌, బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్‌ శోభా కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని సీక్రెట్‌ రివీల్‌ చేసింది. దీంతో అభిమానులు వీరిద్దరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read : Hero Ranbir Kapoor: ఎట్టకేలకు తన కుమార్తెను పరిచయం చేసిన రణ్ బీర్

big bosspriyanka jain
Comments (0)
Add Comment