Chiranjeevi : ఒక్కోసారి లక్ ఎప్పుడు ఎవరిని పలకరిస్తుందో , ఎవరి గడప తొక్కుతుందో చెప్పలేం. ప్రత్యేకించి సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు ఈ అదృష్టం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రంగాలలో ఉన్న వాళ్లకు నమ్మకాలు ఎక్కువ. పూజలు చేయకుండా సినిమాలు ప్రారంభోత్సవాలు కావు.
Chiranjeevi Movie with Anil Ravipudi in Bheems Music
తెలంగాణ ప్రాంతానికి చెందిన భీమ్స్ సిసిరోలియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాడు. తను కొన్ని చిత్రాలకు పని చేసినప్పటికీ తాజాగా నవ్వులు పూయించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సంగీతం అందించాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.
ఇందులో విక్టరీ వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించారు. ఇక బుడ్డోడు బుల్లి రాజా అలియాస్ రేవంత్ హైలెట్ గా నిలిచాడు. అన్నిటికంటే ఇప్పుడు భీమ్స్ అందించిన మ్యూజిక్, పాటలు మ్యాజిక్ చేశాయి. సినిమా విజయానికి దోహద పడ్డాయి. తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకుల గుండెలను మీటాయి.
దీంతో తనకు అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. భీమ్స్ ఎక్కడున్నాడో తెలియదు కానీ …తనతో మరో సినిమా చేయాలని ఉందన్నాడు. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవికి(Chiranjeevi) కథ చెప్పడం ఓకే చెప్పడం కూడా పూర్తయింది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరతో బిజీగా ఉన్నాడు. ఈ కొత్త మూవీ షూటింగ్ ఈ ఏడాది చివరలో ప్రారంభం అవుతుందని టాక్. ఈ సందర్బంగా మెగా మూవీకి సిసిరోలియో సంగీతం అందించనున్నట్లు టాక్.
Also Read : Beauty Sreeleela :బాలీవుడ్ పై లవ్లీ బ్యూటీ శ్రీలీల ఫోకస్