Bharateeyudu 2 OTT : ఎట్టకేలకు ఓటీటీలో ప్రత్యక్షమైన ‘భారతీయుడు 2’

దీంతో అర‌విందన్ అత‌ని టీం త‌మ కుటుంబ స‌భ్యులు చేస్తున్న అవినీతి బ‌య‌ట ప‌డేలా చేస్తారు...

Bharateeyudu 2 : ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మిశ్ర‌మ స్పంద‌న‌ను రాబ‌ట్టుకున్న చిత్రం ‘భార‌తీయుడు 2(Bharateeyudu 2)’ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. క‌మ‌ల్ హాస‌న్, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ మూవీని పొన్నియ‌న్ సెల్వ‌న్ వంటి భారీ చిత్రం త‌ర్వాత‌ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాస్క‌ర‌న్ రెడ్ జెయింట్ బ్యానర్‌తో క‌లిసి హై బడ్జెట్‌తో నిర్మించారు. విడుద‌ల‌కు ముందు చాలా ప్ర‌చార కార్య్ర‌మాలు నిర్వ‌హించి హాడావుడి చేసిన‌ప్ప‌టికీ సినిమాలోని అస‌లు లైన్‌ను ప్ర‌మోట్ చేయ‌కపోవ‌డంతో ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది.

Bharateeyudu 2 Movie OTT Updates

క‌థ విష‌యానికి వ‌స్తే.. చిత్ర అర‌వింద‌న్ అనే యువ‌కుడు మ‌రో ముగ్గురితో క‌లిసి రాష్ట్రంలో జ‌రుగుతున్న అవినీతి, లంచాలు వంటి వాటిని ప్రశ్నిస్తూ సెటైరిక‌ల్ వీడియోలు చేస్తూ యూ ట్యూబ్‌లో పోస్టు చేసేవారు. ఈ క్ర‌మంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఈ అవినీతి, క‌రెప్ష‌న్ వంటి వాటిని చూసి త‌ట్టుకోలేక మ‌రో భార‌తీయుడు (సేనాప‌తి) తిరిగి రావాలని కోరుకుంటూ సోష‌ల్‌మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యేలా చేస్తాడు. ఈ నేప‌థ్యంలో సేనాప‌తి ఓ దేశంలో ఉన్నాడ‌ని తెలుసుకుని ఇండియాకు ఆహ్వానిస్తారు. అయితే తిరిగి వ‌చ్చిన సేనాప‌తి అవినీతి చేస్తున్న వారినంద‌రిని శిక్షంచ‌కుండా ముందు ప్ర‌జ‌లంతా త‌మ ఇంట్లో ఎలాంటి అవినీతి, అన్యాయం జ‌ర‌గ‌కుండా చూసుకోవాల‌ని, ఉపేక్షించ‌వ‌ద్ద‌ని చెబుతాడు.

దీంతో అర‌విందన్ అత‌ని టీం త‌మ కుటుంబ స‌భ్యులు చేస్తున్న అవినీతి బ‌య‌ట ప‌డేలా చేస్తారు. దీంతో వారికి వారి త‌ల్లిదండ్రుల నుంచి, స‌మాజం నుంచి ఎలాంటి ప్ర‌తిఘ‌ట‌న‌లు ఎదుర‌య్యాయనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో నిత్యం మ‌న‌కు ఎదురయ్యే అనుభ‌వాల‌తో సినిమా సాగుతుంది. ఈ క్ర‌మంలో చివ‌ర‌కు ప్ర‌జ‌లు భార‌తీయుడికి మ‌ద్ద‌తుగా నిలిచారా, లేదా అనే పాయుంట్‌తో సినిమా ముగుస్తుంది. అస‌లు అవినీతిని అంత‌మొందించేందుకు సేనాప‌తి వేసిన ఫ్లాన్ ఏంటి అనేది పార్ట్‌3లో ఉంటుందంటూ ఓ ట్రైల‌ర్‌ను కూడా జ‌త చేశారు.

ఇప్పుడీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో త‌మిళంతో పాటు తెలుగు,మ‌ల‌యాళ‌,క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే భార‌తీయుడు1లో అవినీతిపై సేనాప‌తి పోరాటం చేస్తే జ‌న‌వ‌మంతా ఆరాధించారు.. అదే సేనాప‌తి ఇప్పుడు అవినీతిపై పోరాటం చేయ‌డానికి వ‌స్తే ప్ర‌జ‌లు ఎలా రెస్పాండ్ అయ్యార‌నే లైన్‌లో ఈ సినిమా రూపొందింది. మూవీ టీం ఈ పాయింట్‌ను సినిమా ప్ర‌మోష‌న్ల‌లో వాడి ఉంటే సినిమా మంచి విజ‌యం సాధించి ఉండేది. అలా కాకుండా భార‌తీయుడు 1 ను మించి భార‌తీయుడు 2(Bharateeyudu 2) ఉంటుంది అనే స్థాయిలో తెగ ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో ఎన్నో అంచ‌నాల‌తో సినిమాకు పోయిన ప్ర‌జ‌లు నిరాశ చెందారు. అంతేగాక క్లైమాక్స్‌లో వ‌చ్చిన ఫైట్ చాలా లెంగ్తీ అవ‌డం కూడా సినిమాకు కొద్దిగా మైన‌స్ అయింది.

Also Read : Aye: సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ‘ఆయ్’ !

Bharateeyudu 2OTTTrendingUpdatesViral
Comments (0)
Add Comment