Bhagyashri Borse : టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ

ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ భామ ఫోటోలే వైరల్ అవుతున్నాయి...

Bhagyashri Borse : మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా ప్రేక్షకులకు అల్టిమేట్ ఎంటర్‌టైన్మెంట్ అందించడానికి రెడీగా అవుతోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, షో రీల్, టీజర్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేయగా.. ఇప్పుడీ సినిమాలోని హీరోయిన్‌కు సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏంటా వార్తలు అనుకుంటున్నారా?

Bhagyashri Borse…

తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాకు డబ్బింగ్‌ను కంప్లీట్ చేసినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే తన క్యారెక్టర్‌కు భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) సొంతంగా డబ్బింగ్ చెప్పడం గమనార్హం. తెలుగు తన మాతృభాష కాకపోయినప్పటికీ కష్టపడి నేర్చుకొని తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఈ విషయంలో ఆమె డెడికేషన్, ప్రొఫెషనలిజంను చూసిన వారంతా.. ఈ భామ టాలీవుడ్‌ని ఏలేయడం పక్కా అంటూ ప్రశంసిస్తుండటం విశేషం.

ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ‘సితార్, రెప్పల్ డప్పుల్ సాంగ్స్’, టీజర్‌లో తన బ్యూటీఫుల్ స్క్రీన్‌ప్రజెన్స్‌తో ఆడియన్స్‌ని భాగ్యశ్రీ మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ భామ ఫోటోలే వైరల్ అవుతున్నాయి. ఒక్క సినిమా కూడా విడుదలకాకముందే.. ఆమెను టాలీవుడ్ అప్ కమింగ్ క్రేజీ హీరోయిన్ అంటుండటం విశేషం. భాగ్యశ్రీ పెర్ఫార్మెన్స్‌ని బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Also Read : Yogi Babu : ఇకపై అలా చేయనంటూ క్షమాపణలు చెప్పిన యోగిబాబు

Bhagyashri BorseTrendingUpdatesViral
Comments (0)
Add Comment