Bhagyashri Borse: మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, ధమాకా ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో తెరకెక్కించిన తాజా సినిమా ‘మిస్టర్ బచ్చన్’. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఉత్తరాది తార భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ లుక్, షో రీల్, ఫస్ట్ సింగిల్ మరియు సెకండ్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చిది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
Bhagyashri Borse Dance…
ఈ సందర్భంగా హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ప్రమోషన్ ఈవెంట్ లో ఈ సినిమా నుండి ‘నల్లంచు తెల్లచీర’ అనే మరో పాటను విడుదల చేసారు. నల్లంచు తెల్లచీర అంటూ సాగే ఈ మాస్ సాంగ్ ను శ్రీరామ చంద్ర, సమీర భరద్వాజ్ ఆలపించారు. భాస్కరభట్ల ఈ పాటను రచించారు. మాస్ ఆడియన్స్ విజిల్ వేసేలా ఉన్న ఈ సాంగ్ కు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే స్టేజిపైనే స్టెప్పులేసింది. గతంలో టీజర్ రిలీజ్ వేడుకలో కూడా ‘రెప్పల్ డప్పుల్’ సాంగ్ కు భాగ్యశ్రీ చిందేసి అభిమానులను అలరించిన విషయం తెలిసిదే. దీనితో ప్రస్తుతం స్టేజిపైన భాగ్యశ్రీ బోర్సే వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు… సినిమాపై అంచనాలను పెంచేసాయి.
Also Read : Evol: ఓటీటీలోనికి సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసిన బోల్డ్ మూవీ !