Bhagvanth Kesari Song : టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. టేకింగ్ లో మేకింగ్ లో తనదైన ముద్ర వేయడంలో తనకు తనే సాటి. ప్రస్తుతం దమ్మున్న నటుడు నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ తో కలిసి భగవంత్ కేసరి సినిమా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.
Bhagvanth Kesari Song Will be Released
బాలయ్యలోని రౌద్రాన్ని, నటనను ఎలివేట్ చేసే ప్రయత్నంపై ఫోకస్ పెట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం, సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. భగవంత్ కేసరి మూవీని సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.
ఈ చిత్రాన్ని విజయ దశమి అక్టోబర్ 19న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా వినాయకుడి నేపథ్యంతో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు దర్శకుడు. ఇందులో బాలకృష్ణ, శ్రీలీల నటించిన పాట ఆకట్టుకునేలా ఉంది. ఫుల్ జోష్ ను నింపేలా ఉంది. త్వరలో దేశ వ్యాప్తంగా వినాయక చవితి పండుగ రానుంది.
దీంతో ఈ పాట మరింత జనాదరణ పొందడం ఖాయం. చిత్రీకరణ సూపర్ గా ఉంది. బాలయ్య బాబు , శ్రీలీల ఫ్యాన్స్ ను ఆదరిస్తుందనడంలో సందేహం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న బాలకృష్ణ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Brahmanandam Family Visit : శ్రీవారి సేవలో బ్రహ్మానందం