Betting Apps Case Sensational :25 మంది సినీ న‌టులు..యూట్యూబ‌ర్స్ జాబితా 

కేసు న‌మోదు చేసిన హైద‌రాబాద్ పోలీసులు 

Betting Apps : బెట్టింగ్ యాప్స్ కేసు క‌ల‌క‌లం రేపుతోంది. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఈ ఘ‌ట‌న చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. వీరంద‌రికీ నోటీసులు జారీ చేశారు. విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే న‌టి విష్ణు ప్రియ‌, రీతూ చౌద‌రి పోలీసుల ముందు హాజ‌ర‌య్యారు. మూడు గంట‌ల‌కు పైగా విచార‌ణ కొన‌సాగింది. ఇందులో భాగంగా తాను 15కు పైగా బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్ర‌మోష‌న్ చేసిన‌ట్లు ఒప్పుకుంది విష్ణు ప్రియ‌. ఇక రీతూ చౌద‌రి పోలీసులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అవాక్క‌యిన‌ట్లు తెలిసింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌ముఖ న‌టుల‌కు కూడా ఝ‌ల‌క్ ఇచ్చారు పోలీసులు.

Betting Apps Case Updates

బెట్టింగ్ యాప్స్ కు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ఉద్య‌మం చేప‌ట్టారు సీనియ‌ర్ పోలీస్ కాప్ , మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్(VC Sajjanar). ఆయ‌న కొట్టిన దెబ్బ‌కు యూట్యూబ‌ర్లు, న‌టీ న‌టులు బెంబేలెత్తి పోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 25 మందికి పైగా హైద‌రాబాద్ లోని పంజాగుట్ట‌, మియాపూర్ పోలీస్ స్టేష‌న్ల‌లో కేసులు న‌మోద‌య్యాయి. బెట్టింగ్ యాప్స్ ను చ‌ట్ట విరుద్దంగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారంటూ న‌గ‌రానికి చెందిన వ్యాపార‌వేత్త ఫ‌ణీంద్ర శ‌ర్మ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

రానా ద‌గ్గుబాటి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మంచు ల‌క్ష్మి, నిధి అగ‌ర్వాల్, శ్రీ‌ముఖి, విష్ణు ప్రియ‌, హ‌ర్ష  సాయి, ప్ర‌కాశ్ రాజ్, జంగిల్ ర‌మ్మి, ప్ర‌ణీత‌, అన‌న్య నాగ‌ళ్ల‌, సిరి హ‌నుమంతు, వ‌ర్షిణి సౌంద‌ర రాన్ , వాసంతి కృష్ణ‌న్, శోభా షెట్టి, అమృత చౌద‌రి, న‌య‌ని పావ‌ని, నేహా ప‌ఠాన్, పాండు బెట్టింగ్ యాప్స్ ను ప్ర‌మోష‌న్ చేశారు. వీరితో పాటు ప‌ద్మావ‌త్, ఇమ్రాన్ ఖాన్, బ‌య్యా స‌న్నీ యాద‌వ్, శ్యామ‌ల‌, టేస్టీ తేజ‌, రీతూ చౌద‌రి, శేష‌యాని సుప్రీతపై కూడా కేసులు న‌మోద‌య్యాయి.

వీరంద‌రిపై భారత్ న్యాయ సంహిత లోని సెక్షన్లు 318 (4), 112, ఆర్/డబ్ల్యూ 49, ఐటీ యాక్ట్‌లోని 3, 3 (ఏ), టీఎస్‌జీఏలోని 66-డీ కింద ఎఫ్ఐఆర్ నంబర్ 393/2025 ద్వారా కేసులు న‌మోదు చేశారు.

Also Read : Prakash Raj Shocking :ఎనిమిదేళ్ల కింద‌ట యాప్స్ ప్ర‌మోష‌న్ చేశా

ActorsBetting AppsPolice CaseShockingTollywoodUpdatesViral
Comments (0)
Add Comment