Ritu Choudhary Shocking :రీతూ చౌద‌రికి షాక్ ఫోన్ సీజ్

బిగ్ బాస్ బ్యూటీకి పోలీస్ ఝ‌ల‌క్
Ritu Choudhary Shocking :రీతూ చౌద‌రికి షాక్ ఫోన్ సీజ్

Ritu Choudhary : బెట్టింగ్ యాప్స్ వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ప్ర‌త్యేకించి తెలుగు రాష్ట్రాల‌లో యూట్యూబ‌ర్స్ , ఇన్ ఫ్లూయ‌ర్స్ తో పాటు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టీ న‌టులు ఉండ‌డం ఒకింత విస్తు పోయేలా చేసింది. పైకి నీతులు వ‌ల్లిస్తూ ఇంకో వైపు అనైతిక కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న సంస్థ‌లు, బెట్టింగ్ యాప్స్ కు ప్ర‌మోష‌న్స్ చేయ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఇందులో ప్ర‌ధానంగా మంచు ల‌క్ష్మి, రానా ద‌గ్గుబాటి, విష్ణు ప్రియ‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నిధి అగ‌ర్వాల్ , ప్ర‌కాశ్ రాజ్ , త‌దిత‌రులు ఉన్నారు.

Ritu Choudhary Shocking for betting apps Promotion Case

11 మంది యూట్యూబ‌ర్ల‌తో పాటు మొత్తం 25 మందిపై కేసులు న‌మోదు చేశారు హైద‌రాబాద్ పోలీసులు.
వీరంతా తాము సెలెబ్రిటీల‌మ‌ని, తాము ఏం చేసినా చెల్లుతుంద‌ని భావిస్తూ వ‌స్తున్నారు. చ‌ట్టాల‌న్నా, స‌మాజం ప‌ట్ల బాధ్య‌త లేకుండా ప్ర‌వ‌ర్తిస్తుండ‌డం ఒకింత ఆగ్ర‌హాన్ని తెప్పించేలా చేసింది. ఈ త‌రుణంలో సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్, టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్ యుద్దం చేశారు. ఆయ‌న బెట్టింగ్ యాప్స్ ను పూర్తిగా నిషేధం విధించాలంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టారు. ఇదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా యాష్ ట్యాగ్ కూడా క్రియేట్ చేశారు.

దీంతో సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ గా ఉన్న అవినాష్ మ‌హంతి జూలు విదిల్చారు. యూట్యూట‌ర్లు, సినీ రంగానికి చెందిన వారిపై ఉక్కు పాదం మోపారు. దెబ్బ‌కు దిగి వ‌స్తున్నారు. త‌మ‌కు తెలియ‌ద‌ని బుకాయించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ త‌రుణంలో న‌టి విష్ణు ప్రియ‌తో పాటు బిగ్ బాస్ బ్యూటీ గా పేరు పొందిన రీతూ చౌద‌రిని(Ritu Choudhary) పంజాగుట్ట పోలీసులు విచారించారు. ఈ ఇద్ద‌రిని మూడు గంట‌ల‌కు పైగా క్రాస్ ఎగ్జామినేష‌న్ చేశారు. ఇద్ద‌రికి సంబంధించిన ఫోన్ల‌ను సీజ్ చేశారు. ఇవాళో రేపో ఈ ఇద్ద‌రిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం.

Also Read : Actress Vishnu Priya Shocking :న‌టి విష్ణు ప్రియ అరెస్ట్ త‌ప్ప‌దా..?

Betting AppsPolice CaseRitu ChowdaryShockingViral
Comments (0)
Add Comment