Betting Apps : హైదరాబాద్ – బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం చలన చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఇప్పటికే 11 మంది యూట్యూబర్లతో పాటు సినీ రంగానికి చెందిన నటులు కలిపి 25 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నోటీసులు జారీ చేశారు. మరో వైపు పంజాగుట్ట పోలీసుల ముందు హాజరయ్యారు నటి విష్ణు ప్రియ, బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి. వీరిద్దరికి సంబంధించిన మొబైల్స్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. దాదాపు మూడు గంటలకు పైగా విచారణ చేపట్టారు. ఇంకో వైపు ఈడీ కూడా రంగంలోకి దిగింది.
Betting Apps Cases on Prabhas and Balakrishna
ఇదిలా ఉండగా టాప్ హీరోస్ గా ఉన్న నందమూరి బాలకృష్ణ, పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్(Prabhas), గోపీచంద్ లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రామారావు అనే వ్యక్తి. ఈ ముగ్గురు హీరోలు బెట్టింగ్ యాప్(Betting Apps) ఫన్ 88ను ప్రమోషన్ చేశారని ఆరోపించారు. వీరిని నమ్మి తాను డబ్బులు పోగొట్టుకున్నానని ఆరోపించాడు. తన డబ్బులు తనకు ఇప్పించాలని, వీరిపై కేసు నమోదు చేసి ఫ్యాన్స్ మోసపోకుండా చూడాలని పోలీసులను కోరాడు.
ఇదే సమయంలో కోలుకోలేని షాక్ ఇచ్చారు పోలీసులు నటీ నటులకు. విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, శ్రీముఖి, ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారని తేల్చారు. వీరికి కూడా నోటీసులు పంపే పనిలో పడ్డారు. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి టీంలు. కేవలం ఓకే చెప్పిన బెట్టింగ్ యాప్స్ కే ప్రమోషన్ చేశారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. ఏకంగా బెట్టింగ్ యాప్స్, వెబ్ సైట్స్ యూఆర్ఎల్ లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Also Read : Hero Bunny-Arya 2 :బన్నీ బర్త్ డే గిఫ్ట్ ఆర్య 2 మూవీ రీ రిలీజ్