Bench Life : డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి ఓ కొత్త తెలుగు స్ట్రెయిట్ వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్(Bench Life) రెడీ అయింది. చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు కొదండరామిరెడ్డి కుమారుడు వైభవ్ ఈ సిరీస్‌తో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్, రితికా సింగ్, నయన్ సారిక, ఆకాంక్ష సింగ్, చరణ్ పేరి, తనికెళ్ల భరణి, వెంకటేశ్ కాకునూరు ప్రధాన పాత్రల్లో నటించారు. మానస శర్మ దర్శకత్వం వహించగా, పింక్ ఎలిఫెంట్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మించింది. తాజాగా ఈ బెంచ్ లైఫ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు.
Bench Life Series OTT Updates
ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే ఐదుగురు ఉద్యోగుల నేపథ్యంలో వారి రోజువారి జీవితం, ఎమోషన్, ఎంజాయ్‌మెంట్ కలగలిపిన స్టోరీలతో ఈ సిరీస్ తెరకెక్కింది. ప్రస్తుతం తమిళనాట హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న వైభవ్ చివరిసారిగా 2014లో శేఖర్ కమ్ముల అనామిక సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్రలో నటించాడు. గత సంవత్సరం నాగ చైతన్య కస్టడీ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించిన ఆయన మళ్లీ ఇన్నాళ్లకు తన భాషలో నటిస్తుండడం విశేషం. ఇక.. గతంలో ముద్దపప్పు అవకాయ్, నాన్నకూచి, హలో వరల్డ్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వంటి వెబ్ సిరీస్‌లతో, ఇటీవలే కమిటీ కుర్రాళ్లు సినిమాతో నిర్మాతగా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన నిహారిక కొణిదెల ఈ సిరీస్‌ను నిర్మించడంతో ఇప్పుడు సర్వత్రా ఈ సిరిస్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. కాగా ఈసిరీస్ సెప్టెంబర్ 12 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Also Read : Hero Vikram : స్త్రీల రక్షణకు మనతోపాటు వ్యవస్థలు కూడా మారాలి