Bellamkonda Sai Sreenivas: నాలుగు వందల ఏళ్ల నాటి గుడి కథతో వస్తున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ !

నాలుగు వందల ఏళ్ల నాటి గుడి కథతో వస్తున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ !

Bellamkonda Sai Sreenivas: ఓ నిర్మాత కొడుకుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌… బడా స్టార్లకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద దర్శకులు, స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేస్తున్నారు. ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన చత్రపతి సినిమాను రీమేక్ చేయడం ద్వారా టాలీవుడ్ నుండి బాలీవుడ్ లోనికి ప్రవేశించారు. అయితే ఆశించిన ఫలితాన్ని పొందలేకపోయారు. అయినప్పటికీ తన సినిమాల్లో జోరును మాత్రం తగ్గించడం లేదు ఈ యువ హీరో.

Bellamkonda Sai Sreenivas Movie Updates

తాజాగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌(Bellamkonda Sai Sreenivas) హీరోగా లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వంలో మహేశ్‌ చందు ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ 75వ జయంతి, హీరో శ్రీనివాస్‌ ఇండస్ట్రీలోకి నటుడిగా వచ్చి పదేళ్లు పూర్తి కావడం… ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని ఈ సినిమాను మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ‘ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. జూలై 24న రెండో షెడ్యూల్‌ను మొదలు పెట్టనున్నాం. కమర్షియల్‌ అంశాలతో కూడిన శక్తివంతమైన, ఆసక్తికరమైన కథను సిద్ధం చేశారు లుధీర్‌’’ అని చిత్ర బృందం పేర్కొంది.

ఈ సినిమాకు సంబంధించి ఓ పురాతన గుడి ముందు తుపాకీ పట్టుకుని నిల్చున్నారు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. ఆ గుడి నాలుగువందల ఏళ్ల క్రితం నాటిది. ఆ గుడికి హీరో ఎందుకు వెళ్లాలనుకుంటాడు ? అనేది విషయాన్ని ఈ సినిమా ద్వారా తెరకెక్కించినట్లు సమాచారం.

Also Read : Amitabh Bachchan: పెళ్లికి ముందే తన భార్య జయా బచ్చన్ కు కండీషన్‌ పెట్టిన బిగ్‌ బీ అమితాబ్ ?

Bellamkonda Sai SreenivasBellomkonda SureshTollywood
Comments (0)
Add Comment