Bellamkonda Sai Sreenivas: నిర్మాత కొడుకుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన యువ కథానాయకుడు బెల్లకొండ శ్రీనివాస్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించిన బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas) మొదటి సినిమా ‘అల్లుడు శ్రీను’… జులై 25 2014న విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తున్నారు. ‘జయ జానకీ నాయక’, ‘రాక్షసుడు’ తదితర చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. తాను సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా… అందులకు ఆహారం, బట్టలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
Bellamkonda Sai Sreenivas Helped
‘‘చిత్ర పరిశ్రమలో ఈ పదేళ్లు మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చాయి. నా సినిమాలను ఆదరించిన అభిమానులు, ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా జయాపజయాలతో సంబంధం లేకుండా అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు. వారి సహకారమే ఎప్పుడూ నిలబడేలా చేసింది. నాకెంతో ఇచ్చిన ఈ సమాజానికి ఇలాంటి అద్భుతమైన రోజున ఏదైనా తిరిగి ఇవ్వాలనిపించింది. అందుకు ఆనందాన్ని పంచుకుంటున్నా. మీ దీవెనలు, సహకారం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’’ అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
తన సినీ కెరీర్‌లో సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas) మరో ప్రత్యేక ఘనతను కూడా సాధించారు. ఆయన నటించిన ‘జయ జానకి నాయక’ హిందీ వెర్షన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ‘ఖూన్ఖర్’ పేరుతో యూట్యూబ్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకూ 848 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ అందుకున్న చిత్రంగా ఘనత సాధించింది. ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మహేశ్ చందు ఓ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read : Shakhahaari OTT : ఓటీటీలో తెలుగు లో అలరిస్తున్న కన్నడ మర్డర్ మిస్టరీ మూవీ