Bedurulanka 2012 : క్లాక్స్ దర్శకత్వం వహించిన బెదురులంక 2012 దూసుకు పోతోంది. విడుదలైన ప్రతి చోటా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముప్పనేని రవీంద్ర బెనర్జీ ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తికేయ గుమ్మకొండ , నేహా శెట్టి నటించారు. మణి శర్మ సంగీతం అందించారు. ఆగస్టు 25న బెదురులంక 2012 చిత్రం విడుదలైంది.
Bedurulanka 2012 Movie Viral
ఈ చిత్రాన్ని రూ. 8 కోట్లు ఖర్చు చేసి సినిమా తీశారు. ఇప్పటికే కేవలం మూడు రోజుల్లోనే రూ. 7 కోట్లు కొల్లగొట్టింది బెదురులంక 2012(Bedurulanka 2012) . కార్తికేయ, నేహా శెట్టితో పాటు అజయ్ ఘోష్ , శ్రీకాంత్ అయ్యంగార్ , ఎల్బీ శ్రీరామ్ కీలక పాత్రలలో నటించారు.
ఈ మూవీ టైటిల్ , ప్రీలుక్ గత ఏడాది నవంబర్ 28న విడుదల చేశారు. చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ 30న రిలీజ్ చేశారు. మణిశర్మ అద్భుతంగా సంగీతం అందించారు. బెదురులంక అనే కల్పిత గ్రామంలో 2012లో జరిగిన నాటకీయంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు దర్శకుడు క్లాక్స్.
ఈ చిత్రానికి సంబంధించి సంగీతపు హక్కులను సోనీ మ్యూజిక్ సౌత్ సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత మణి శర్మ ఈ మూవీకి అద్భుతమైన సంగీతం అందించడం విశేషం.
Also Read : Jailer Producer Gift : రజనీకాంత్ కు బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్