Beauty Kriti : బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కృతి సనన్ హాట్ టాపిక్ గా మారారు. 12 ఏళ్ల తర్వాత ధనుష్ హిందీలోకి ఎంటర్ అయ్యారు. తను గతంలో ఆనంద్ ఎల్ రాయ్ తీసిన మూవీలో నటించాడు. ఇప్పుడు కృతి(Beauty Kriti)తో కలిసి స్క్రీన్ ను పంచుకోనున్నారు. 2013లో రామ్ జానాలో కలిసి ఇద్దరూ పని చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Beauty Kriti Sanon-Dhanush Movie
ఆనంద్..కృతి..భూషణ్ కుమార్..ఏఆర్ రెహమాన్ జట్టు మరోసారి జత కట్టనుంది. ఇందుకు సంబంధించి మూవీ పేరు కూడా ఖరారు చేశారు. దీనికి తేరే ఇష్క్ మే అని ఇవాళ కీలక ప్రకటన చేశారు మూవీ మేకర్స్. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సీరీస్ నిర్మిస్తోంది.
ఈ సందర్బంగా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2011లో తను వెడ్స్ మను మూవీ తర్వాత..నాలాంటి వ్యక్తి విషాదాన్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలని ఉందన్నాడు. హిమాంశు శర్మ రాం ఝానా పేరుతో కథ వినిపించాడు. ఇది విపరీతంగా నచ్చింది. దానిని మనసు పెట్టి తీశాను..అది ఊహించని ఆదరణ పొందిందన్నాడు. ఇదే హిమాంశు మరోసారి అద్బుతమైన కథతో ముందుకు వచ్చాడని తెలిపాడు. ప్రేమ, విషాదం మీద కేంద్రీకృథమైన కథనే తేరే ఇష్క్ మే.
కొత్త చిత్రానికి ధనుష్ కు ఎవరు సరిపోతారని అన్వేషించా..నాకు కృతీ సనన్ కరెక్ట్ గా దొరికిందన్నాడు డైరెక్టర్.
Also Read : Kangana Emergency : రూ. 20 కోట్లకు చేరువలో ‘ఎమర్జెన్సీ’