Golden Ticket : బిగ్ బికి గోల్డెన్ టికెట్

బీసీసీఐ కార్య‌ద‌ర్శి షా

Golden Ticket : బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త్వ‌ర‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వ‌ర్యంలో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు భార‌త్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. దీంతో ఈ ఏడాది జ‌రిగే వ‌రల్డ్ క‌ప్ కోసం షెడ్యూల్ కూడా ఖ‌రారు చేసింది. బీసీసీఐ స్టేడియంల‌ను కూడా ఎంపిక చేసింది.

Golden Ticket to Amitabh Bachchan

ఇందులో భాగంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయ‌డంలో మునిగి పోయింది బీసీసీఐ(BCCI). ప‌లువురు ప్ర‌ముఖుల‌ను ఐకాన్స్ గా గుర్తించింది. తాము నిర్వ‌హించే వ‌ర‌ల్డ్ క‌ప్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రింత ప్రాచుర్యం తీసుకు వ‌చ్చేలా ప్లాన్ చేస్తోంది.

తాజాగా మంగ‌ళ‌వారం బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కు రాబోయే వ‌ర‌ల్డ్ క‌ప్ కు సంబంధించి బీసీసీఐ త‌ర‌పున గోల్డెన్ టికెట్ ను అంద‌జేశారు. ఆయ‌న‌కు టికెట్ బ‌హూక‌రించ‌డం త‌మ‌కు గ‌ర్వకార‌ణంగా ఉంద‌ని పేర్కొన్నారు జే షా.

సినిమా రంగానికి సంబంధించి అమితాబ్ బ‌చ్చ‌న్ సూప‌ర్ స్టార్ ఆఫ్ ది మిలీనియంగా పేరు పొందార‌ని పేర్కొన్నారు. లెజండ‌రీ న‌టుడిగానే కాకుండా ఆయ‌న‌కు క్రికెట్ అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం అని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. బ‌చ్చ‌న్ టీమిండియాకు మెరుగైన రీతిలో మ‌ద్ద‌తు ఇస్తూనే ఉన్నార‌ని కితాబు ఇచ్చారు.

Also Read : Sesham Miceil Fathima : శేష‌మ్ మైక్ -ఇల్ ఫాతిమా వైర‌ల్

Comments (0)
Add Comment