Mohini Dey : ఏ ఆర్ రెహ్మాన్ విడాకులపై కీలక వ్యాఖ్యలు చేసిన బేస్ గిటారిస్ట్

వారంతా నా ఇంటర్వ్యూలు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసు...

Mohini Dey : ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఏ.ఆర్‌ రెహమాన్‌ సైరా భాను దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే! వీరి విడాకులు ప్రకటించిన సమయంలోనే రెహమాన్‌ టీమ్‌లోని బేస్‌ గిటారిస్ట్‌ మోహినిదే(Mohini Dey) కూడా తన భర్తతో విడిపోతున్నట్లు తెలిపింది. దీంతో వీరిద్దరూ ఒకేసారి విడాకులు నిర్ణయాన్ని బయటపెట్టడంతో రకరకాల వార్తలు హల్‌చల్‌ చేశాయి. రెహమాన్‌కు, మోహినిడేకు ఏమైనా సంబంధం ఉందా? అన్న చర్చ మొదలైంది. తాజాగా దీనిపై మోహినిదే స్పందించారు. ఆ రూమర్స్‌ను ఖండించారు.

Mohini Dey Comment

‘నేను విడాకుల గురించి ప్రకటన చేసినప్పటినుంచి ఇంటర్వ్యూల కోసం ఎంతోమంది ఫోన్‌ చేస్తున్నారు. వారంతా నా ఇంటర్వ్యూలు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసు. నేను అందరి అభ్యర్థనను గౌరవంగా తిరస్కరిస్తున్నాను. ఎందుకంటే వారు అనుకుంటున్న దాని గురించి మాట్లాడడానికి నాకు ఆసక్తి లేదు. ఇలాంటి రూమర్స్‌పై మాట్లాడి విలువైన నా సమయాన్ని వృథా చేసుకోలేను. దయచేసి నా ప్రైవసీని గౌరవించండి’ అని తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ పెట్టారు. ఈ విషయంపై సైరా తరఫు న్యాయవాది వందనా షా స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. ‘ఈ రెండు జంటల విడాకులకు ఎలాంటి సంబంధం లేదు. పరస్పర అంగీకారంతో సైరా- రెహమాన్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వివాహ బంధంలో సైరా వ్యక్తిగతంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. వారిద్దరూ విడిపోవడానికి ఎన్నో కారణాలున్నాయి’’ అని క్లారిటీ ఇచ్చారు.

Also Read : Suriya-Trisha : దశాబ్దకాలం తర్వాత మరో సినిమాతో రానున్న ఆ సక్సెస్ ఫుల్ జోడి

AR RahmanBreakingDivorceUpdatesViral
Comments (0)
Add Comment