Bangaru Bomma: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై ‘బంగారు బొమ్మ’ సందడి !

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై ‘బంగారు బొమ్మ’ సందడి !

Bangaru Bomma: ఎం.సి.హరి, ప్రొజాక్‌లు నటించిన ‘బంగారు బొమ్మ(Bangaru Bomma)’ అనే ఇండిపెండెంట్ ఆల్బమ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటను ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్ విడుదల చేశారు. ఈ పాటను ఎం.సి.హరి, ప్రొజాక్‌లు రాయడమే కాకుండా స్వయంగా ఆలపించడం విశేషం. వేదం వంశీ ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ క్రేజీ ఇండిపెండెంట్ ఆల్బమ్‌ను క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణీత్ నెకురి నిర్మించారు. ఈ ఆల్బమ్‌లోని విజువల్స్, కాన్సెప్ట్ అన్నీ బాగున్నాయనేలా ఈ ఆల్బమ్ పాజిటివ్ స్పందనను రాబట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ‘బంగారు బొమ్మ’ ఆల్బమ్ న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ భవనంపై సందడి చేస్తుండటం విశేషం.

Bangaru Bomma….

ఈ ఆల్బమ్ రిలీజ్ చేసిన అనంతరం ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్(Chandrabose) మాట్లాడుతూ.. బంగారు బొమ్మ(Bangaru Bomma) అనే ఇండిపెండెంట్ ఆల్బమ్‌ను ఎం.సి.హరి, ప్రొజాక్‌లు రాయడమే కాకుండా స్వయంగా ఆలపించడం గొప్ప విషయం. వేదం వంశీ బాణీ కట్టారు. ప్రస్తుతం ఇలాంటి ఇండిపెండెంట్ ఆల్బమ్స్‌కి ఎక్కువగా క్రేజ్ ఏర్పడింది. నిర్మాత ప్రణీత్ అమెరికాలో డాక్టర్. కళ మీదున్న ప్యాషన్‌తో ఇక్కడకు వచ్చి ఇలా ఇండిపెండెంట్ ఆల్బమ్‌ను నిర్మించారు. ఈ పాటలో రెండు లేయర్స్ ఉన్నాయి. ఇదొక కొత్త ఆలోచనకు నాంది. ఇలాంటి ఆల్బమ్స్ మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. ఈ ఆల్బమ్ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.

ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు… మొదటి నుంచి ఏ రంగంలోనైనా వినిపించే మాట ఇదే. టాలెంట్‌ను ప్రదర్శించేందుకు ప్రస్తుతం ఎన్నో మార్గాలు, సాధనాలున్నాయి. యంగ్ యాక్టర్స్, మ్యూజిషియన్స్, ఆర్ట్ మీద ఫ్యాషన్ ఉన్న వాళ్లంతా కూడా రకరకాల మాధ్యమాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ ఆల్బమ్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. స్టార్ హీరో, హీరోయిన్లు సైతం ఇండిపెండెంట్ ఆల్బమ్స్‌పై దృష్టి పెడుతున్నారు. అయితే మిగతా భాషలతో పోలిస్తే తెలుగులో ఇండిపెండెంట్ ఆల్బమ్స్ తక్కువగా వస్తుంటాయనే విషయం తెలిసిందే. ఆ లోటుని తీర్చేందుకు ఇప్పుడు బంగారు బొమ్మ సిద్ధమైంది.

Also Read : Malvi Malhotra: రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యపై మాల్వీ మల్హోత్ర సంచలన వ్యాఖ్యలు !

Bangaru BommaNew York Times Square
Comments (0)
Add Comment