Bandla Ganesh Shocking :సింగ‌న‌మ‌ల కామెంట్స్ బండ్ల సీరియ‌స్

ఆ ఇద్ద‌రి వ‌ల్లే రూ. 100 కోట్లు న‌ష్ట పోయా

Bandla Ganesh : ప్ర‌ముఖ నిర్మాత సింగ‌న‌మ‌ల ర‌మేష్ చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మ‌రో నిర్మాత బండ్ల గ‌ణేష్(Bandla Ganesh). తాను రూ. 100 కోట్లు పెద్ద హీరోల కార‌ణంగా న‌ష్ట పోయాన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని షేక్ చేసింది. త‌న‌కు ఎక్కువ‌గా న‌ష్టం వ‌చ్చేలా చేసింది ఆ రెండు సినిమాలేనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

Bandla Ganesh Shocking Comments on…

వాటిలో ఒక‌టి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన కొమురం పులి కాగా రెండోది ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టించిన ఖ‌లేజా మూవీ. ఈ రెండూ ఆశించిన మేర ఆడ‌లేదు. దీంతో అప్పులు చేసి కోట్లు ఖ‌ర్చు చేశాన‌ని, క‌ష్ట కాలంలో ఏ ఒక్క‌రూ త‌న వైపు క‌న్నెత్తి చూడ‌లేద‌ని వాపోయారు. క‌నీసం ఎలా ఉన్నావంటూ కూడా ప‌ల‌క‌రించ లేద‌న్నాడు.

పైకి స్టార్లు మాత్ర‌మేన‌ని , స‌క్సెస్ ఉంటేనే చూస్తార‌ని, ఆ త‌ర్వాత చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తార‌ని మండిప‌డ్డారు. ఓ వ్యాపార‌వేత్త‌ను మోసం చేశార‌న్న కేసులో జైలుకు పోయి వ‌చ్చాడు సింగ‌న‌మ‌ల‌. కోర్టు త‌న‌ను నిర్దోషిగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడాడు. ఇదిలా ఉండ‌గా ర‌మేష్ బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు బండ్ల గ‌ణేశ్.

సినిమాను స‌రిగ్గా చేసుకోకుండా హీరోల‌ను బాధ్యులుగా చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. త‌ప్పు మీరు చేసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను అంటే ఎలా అని మండిప‌డ్డారు.

Also Read : Hero PK- A M Rathnam :ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా స‌క్సెస్ ప‌క్కా

Bandla GaneshCommentsProducerSlamsViral
Comments (0)
Add Comment