Bandaru Dattatreya : బ‌న్నీతో దత్త‌న్న ముచ్చ‌ట‌

అల్లు అర్జున్ కు అభినంద‌న

Bandaru Dattatreya : హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ ప్ర‌ముఖ న‌టుడు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం జాతీయ అవార్డులు ప్ర‌క‌టించింది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప ది రైజ్ మూవీలో న‌టించినందుకు గాను బ‌న్నీని జాతీయ ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక‌య్యాడు.

Bandaru Dattatreya Appreciates Allu Arjun

ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని గ‌వ‌ర్న‌ర్ నేరుగా బ‌న్నీ ఇంటికి వెళ్లారు. అల్లు అర్జున్ కు పుష్ప గుచ్ఛం ఇచ్చి అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. అద్భుతంగా న‌టించావంటూ కితాబు ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే గ‌వ‌ర్న‌ర్(Bandaru Dattatreya) స్థాయిలో ఉన్న వ్య‌క్తి ఇలా ఓ హీరో ఇంటికి వెళ్ల‌డం స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అనుకుంటున్నారో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇక క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ అల్లు అర్జున్ తో అద్భుతంగా న‌టింప చేశాడు. చంద్ర‌బోస్ సూప‌ర్ సాంగ్స్ రాస్తే, దేవిశ్రీ ప్ర‌సాద్ దుమ్ము రేపేలా మ్యూజిక్ అందించాడు. ఊ అంటావా పాట దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. బ‌న్నీ మేన‌రిజం, ప‌లికించిన డైలాగులు ఆక‌ట్టుకునేలా చేశాయి. భారీ ఎత్తున కాసులు కురిశాయి.

ఈ ఒక్క మూవీతో రికార్డు బ్రేక్ చేశారు అల్లు అర్జున్. పుష్ప ది రైజ్ మూవీతో బ‌న్నీ ఐకాన్ స్టార్ గా మారి పోయాడు.

Also Read : Brahmanandam : బ‌న్నీకి బ్ర‌హ్మానందం కంగ్రాట్స్

bandaru dattatreya governor allu arjun pushpa movie
Comments (0)
Add Comment