Balayya Movie : టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ కలిగిన నటుడు నందమూరి బాలకృష్ణ. తను నటించిన భగవంత్ కేసరి దుమ్ము రేపింది. రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరింది. భావోద్వేగాలను తెర మీద ప్రతిఫలించేలా సక్సెస్ అయ్యాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
Balayya Movie Updates
తాజాగా మరో దర్శకుడు బాబికి ఛాన్స్ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ(Balayya). ఇందుకు సంబంధించి సినిమా స్టార్ట్ అయ్యిందంటూ ప్రకటించాడు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిజైన్ చేశాడు పోస్టర్ ను. గొడ్డలికి కళ్ల జోడు జోడించాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది.
ఇక నందమూరి బాలకృష్ణకు సంబంధించి తన కెరీర్ లో ఇది 109వ సినిమా. మెగాస్టార్ చిరంజీవితో బాబీ వాల్తేరు వీరయ్య తీశాడు. అది సూపర్ సక్సెస్. తాజాగా తను తీయబోయే చిత్రానికి తన సత్తా ఏమిటో కేవలం ప్రారంభం నుంచే చూపించాడు.
ఇక బాలయ్య బాబు అంటే ఆషా మాషీ వ్యవహారం కాదు. ఏ పాత్ర అయినా సరే దానికి న్యాయం చేసేంత దాకా ఊరుకోడు. తను అందులో లీనమై పోతాడు. ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య డైరెక్టర్స్ ఛాయిస్ అని చెప్పక తప్పదు. మొత్తంగా గొడ్డలికి కళ్లద్దాలు జోడించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : Eagle Movie : సంక్రాంతి బరిలో ఈగిల్