Vijay Deverakonda : రౌడీ బాయ్ కోసం రంగంలోకి దిగుతున్న బాలయ్య

ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు...

Vijay Deverakonda : రౌడీ బాయ్ ‘విజయ్ దేవరకొండ’ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న సినిమా ‘VD 12’. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. 2025 సమ్మర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రిలీజైన ఓ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) లుక్ అందరిని తెగ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్ అప్డేట్స్‌తో హైప్ క్రియేట్ చేయాలనీ భావిస్తోంది. అయితే ఈ చిత్ర మేకర్స్ చేసిన ప్లాన్‌కి మీ మైండ్ బ్లైండ్ కావాల్సిందే. ఈ సినిమా టైటిల్ కూడా ఇంకా రివీల్ కాకపోవడంతో మేకర్స్ టైటిల్ టీజర్‌ని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ టీజర్‌కి గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృషని వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు సంప్రదించారట మేకర్స్. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారట. దీంతో రౌడీ బాయ్ ప్లస్ గాడ్ ఆఫ్ మాసెస్ కాంబినేషన్‌లో టీజర్ ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అంటున్నారు ఫ్యాన్స్.

Vijay Deverakonda Movie..

‘మళ్ళీరావా’, ‘జెర్సీ’ వంటి సినిమాలతో ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమాలు అందించిన గౌతమ్ తిన్ననూరి ఈ సారి యాక్షన్ జోనర్ లోకి షిఫ్ట్ అయ్యాడు. ఈ సినిమా పోస్టర్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. ఇది మంచి కంబ్యాక్ ఫిల్మ్ కాబోతుందని విశ్లేషకుల మాట. ఈ గ్యాప్‌లో గౌతమ్ మరో చిన్న ప్రాజెక్ట్ తో థియేటర్ల ముందుకి రానున్నాడు. నూతన నటీనటులతో ‘మ్యూజిక్’ అనే సరికొత్త చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ చివర్లో తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ.. వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనుండటం విశేషం.

Also Read : Actress Kasthuri : నటి కస్తూరిపై భగ్గుమన్న మద్రాస్ హైకోర్టు

Balakrishna NandamuriMoviesTrendingUpdatesvijay devarakondaViral
Comments (0)
Add Comment