Balakrishna : మరో కొత్త ప్రాజెక్ట్ లో సూపర్ హీరోగా రానున్న ‘బాలకృష్ణ’

దీంతో బాలకృష్ణ రాబోయే సూపర్‌హీరో ప్రాజెక్ట్ పై ఉత్కంఠ పెరుగుతోంది...

Balakrishna : నందమూరి బాలకృష్ణ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భగవంత్ కేసరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య.. తర్వాత ఎలాంటి సినిమా చేయనున్నాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా బాలయ్య నెక్ట్స్ మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ఇప్పుడు నిజమైంది. అఖండ తర్వాత డిఫరెంట్ మూవీస్, పాత్రలు చేస్తున్న బాలయ్య… ఇప్పుడు మరో మూవీ కోసం సూపర్ హీరోగా కనిపించనున్నారు. దసరా కానుకగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ భారతదేశంలోనే సరికొత్త మాస్ సూపర్‌హీరోగా అలరించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను రేపు (అక్టోబర్ 12)న అనౌన్స్ చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.

Balakrishna Movies..

దీంతో బాలకృష్ణ రాబోయే సూపర్‌హీరో ప్రాజెక్ట్ పై ఉత్కంఠ పెరుగుతోంది. ఇక ఈ సినిమా ఆయన గత పాత్రలకు భిన్నంగా ఉంటుందని హామీ ఇచ్చే ఈ కొత్త పాత్రను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్య నెక్ట్స్ ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది.

Also Read : Director Venu : బలగం డైరెక్టర్ తో సినిమాకు నో అంటున్న హీరోలు

BalakrishnaMoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment