Hero Balakrishna :ప‌ద్మ భూష‌ణ్ పై బాల‌య్య షాకింగ్ కామెంట్స్

స‌రైన స‌మ‌యంలో వ‌చ్చింద‌న్న న‌టుడు

Balakrishna : టాలీవుడ్ లో తన గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నంద‌మూరి న‌ట వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని న‌టుడిగా, ప్ర‌జా ప్ర‌తినిధిగా, హోస్ట్ గా త‌న‌ను ప్రూవ్ చేసుకున్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌(Balakrishna). బ‌స‌వ తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిని త‌న ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. సామాజిక కార్య‌క్ర‌మాల‌తో ముందుకు వెళుతున్నారు. బాల‌య్య చేసిన సేవ‌ల‌ను గుర్తించింది కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ మోదీ ప్ర‌భుత్వం. తాజాగా ప్ర‌క‌టించిన అత్యున్న‌త పుర‌స్కారాల‌లో ఒక‌టైన పద్మ భూష‌ణ్ అవార్డును ప్ర‌క‌టించింది.

Balakrishna Shocking Comments on Padma Bhushan

ఇదే స‌మ‌యంలో త‌న సినీ కెరీర్ లో అద్భుత‌మైన చిత్రంగా నిలిచిన ఆదిత్య 369 సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. కొన్నేళ్ల త‌ర్వాత తిరిగి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ఈవెంట్ లో ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు నంద‌మూరి న‌ట సింహం. ప‌ద్మ భూష‌ణ్ అవార్డు పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఎవ‌రో సిఫార్సు చేస్తే త‌న‌కు ఈ అవార్డు రాలేద‌న్నారు. త‌న ఇన్నేళ్ల న‌ట జీవితం త‌న‌ను మ‌రింత రాటు దేలాలా చేసింద‌న్నాడు బాల‌య్య‌య‌. స‌రైన స‌మ‌యంలోనే త‌న‌కు ప‌ద్మ భూష‌ణ్ వ‌చ్చింద‌ని చెప్పాడు.

తాను న‌టించిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. ఏ జ‌నరేష‌న్ కైనా న‌చ్చుతాయ‌ని చెప్పారు. ఇలాంటి మూవీస్ చాలా మంది చేయాల‌ని న‌టీ న‌టులు ప్ర‌య‌త్నం చేశార‌ని కానీ వ‌ర్క‌వుట్ కాలేద‌న్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. అంద‌రి ప్రేక్ష‌కులు లాంటి వారు తెలుగు వారు కాద‌న్నారు. వీరంతా ఎల్ల‌ప్పుడూ కొత్త ద‌నాన్ని కోరుకుంటార‌ని అందుకే ఆదిత్య 369 ఆ రోజుల్లో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింద‌న్నారు.

Also Read : Hero Karthi-Sardar 2 :మే 30న కార్తీ స‌ర్దార్ -2 మూవీ విడుద‌ల

BalakrishnaCommentsPadma AwardsViral
Comments (0)
Add Comment