Balakrishna Nandamuri: నందమూరి నటసింహాం నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణానికి యాభై ఏళ్ళు పూర్తవుతున్నాయి. దివంగత నందమూరి తారక రామారావు వారసుడిగా ‘తాతమ్మకల’ సినిమాతో 1974లో బాల నటుడిగా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించిన బాలకృష్ణ… అగ్ర కథా నాయకుడిగా టాలీవుడ్ లో, హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయా, బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా సేవా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. బాల నటుడిగా బాలకృష్ణ(Balakrishna Nandamuri) నటించిన ‘తాతమ్మకల’విడుదలై ఈ ఆగస్టు 30 నాటికి యాభై ఏళ్ళు అవుతోంది. దీనితో సెప్టెంబరు 1న బాలకృష్ణను ఘనంగా సన్మానించాలని తెలుగు చలన చిత్ర పరిశ్రమ నిర్ణయించింది.
Balakrishna Nandamuri…
ఈ నేపథ్యంలో తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి కార్యదర్శి కె.ఎల్.దామోదర్ ప్రసాద్, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్ నారంగ్, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇటీవల హైదరాబాద్‌లో బాలకృష్ణని కలిసి… సన్మాన వేడుక ఏర్పాటుకు అంగీకారం తెలపాల్సిందిగా కోరారు. అందుకు బాలకృష్ణ(Balakrishna Nandamuri) అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి ఆయనను ఘనంగా సన్మానించాలానే నిర్ణయం తీసుకున్నట్లుగా, అందుకు అంగీకరించాలని బాలయ్యని కోరినట్లుగా, అందుకు బాలయ్య ఓకే చెప్పినట్లుగా తెలుపుతూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి ఓ లేఖను విడుదల చేశారు. ఈ బాలకృష్ణ సన్మాన వేడుకకు భారతీయ సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని టి.ప్రసన్నకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
‘‘నటసింహం నందమూరి బాలకృష్ణ 30.8.1974న విడుదలైన తెలుగు చిత్రం ‘తాతమ్మ కల’తో తన సినీ కెరీర్‌ను హీరోగా ప్రారంభించి, హీరోగా తన కెరీర్లో 50 ఏళ్ల తర్వాత కూడా, సినిమా ఇండస్ట్రీలో హ్యాట్రిక్స్‌తో హీరోగా కొనసాగుతున్నారు. 50 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రల్లో హీరోగా కొనసాగుతున్న ప్రపంచంలోనే ఏకైక కళాకారుడు నందమూరి బాలకృష్ణ. ఆయన గోల్డెన్ జూబ్లీ సినీ హీరో. రాజకీయ రంగంలో, ఆయన వరుసగా మూడు పర్యాయాలు ఏపీ శాసనసభకు ఎన్నికైన హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న హైదరాబాద్‌లోని బసవ తారకం ఇండో-బ్రిటీష్ క్యాన్సర్ హాస్పిటల్స్‌కు ఆయన ఛైర్మన్ గా ఉన్నారు. ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు ఆయన చేసిన అవిశ్రాంత కృషి మరువలేనిది, ఇక్కడ కేవలం భారతదేశం నుండి వచ్చిన రోగులు మాత్రమే కాకుండా విదేశాల నుండి వచ్చిన రోగులు కూడా చికిత్స పొందుతున్నారు. బాలకృష్ణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. సినీ పరిశ్రమలో, రాజకీయ రంగంలో ఎమ్మెల్యేగా అలాగే ప్రజాసేవలో ఆయన చేసిన సేవలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.
Also Read : 68th Filmfare Awards: 68వ ఫిలింఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన RRR, సీతారామం, విరాట పర్వం !