Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్వకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్, శరత్ కుమార్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
అయితే ఓటీటీ రిలీజ్ ఎప్పుడెప్పుడా ? అని ఎదురు చూస్తున్న బాలయ్యబాబు(Balakrishna) అభిమానులకు చిత్ర యూనిట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజు అంటే నవంబరు 24 నుండి ‘భగవంత్ కేసరి’ సినిమాను స్ట్రీమింగ్ కు ఉంచింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ వంటి దాదాపు అన్ని పాన్ ఇండియా భాషల్లో కూడా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంచింది. దీనితో థియేటర్లలో మిస్ అయిన అభిమానులు బాలయ్యబాబు యాక్షన్ ధమాకాను ఓటీటీలో ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు.
Balakrishna – మహిళలను విశేషంగా ఆకట్టుకున్న బాలయ్య గుడ్ టచ్… బ్యాడ్ టచ్… ఎపిసోడ్
సినిమా కథ విషయానికి వస్తే అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి (బాలకృష్ణ)…. ఓ కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు జైలర్ (శరత్‌కుమార్) కూతురు విజయలక్ష్మి అలియాస్ విజ్జి పాప (శ్రీలీల)తో అనుబంధం ఏర్పడుతుంది. విజ్జిపాపని ఆర్మీలో చేర్చాలనేది తన తండ్రి కల. అనుకోకుండా జైలర్ మరణించడంతో విజ్జి పాప బాధ్యతల్ని భగవంత్ కేసరి తీసుకుంటాడు. ఆమెని ఓ సింహంలా తయారు చేయాలని డిసైడ్ అవుతాడు. ఆ ప్రయత్నం ఎలా సాగింది ? సైకాలజిస్ట్ కాత్యాయని (కాజల్) ఎలా సాయం చేసింది ? ఇంతకీ భగవంత్ కేసరి జైలుకి ఎందుకు వెళ్లాడు ? ఆయన గతమేంటి ? రాజకీయ నాయకుల్ని తన గుప్పెట్లో పెట్టుకుని ప్రాజెక్ట్ వి కోసం ప్రయత్నాలు చేస్తున్న బిలియనీర్ రాహుల్ సాంఘ్వీ (అర్జున్ రాంపాల్)తో ఉన్న వైరం ఏమిటనేది ‘భగవంత్ కేసరి’ సినిమా.
Also Read : Dhruva Nakshatram: దృవనక్షత్రం రిలీజ్ కు ఆర్ధిక కష్టాలు… ఆందోళనలో అభిమానులు