Balakrishna: యువ దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘NBK 109’. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్ టైన్ మెంట్ సంయుక్త బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. గతంలో విడుదల చేసిన ‘బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్, వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్’ అంటూ మారణాయుధాలు, మందు బాటిల్స్ ఉన్న కూడిన పోస్టర్ కు, మహా శివరాత్రి సందర్బంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింఫ్స్ మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
Balakrishna Movies Update
బాబీ-బాలయ్య కాంబోలో వస్తున్న ఈ సినిమా భారీగా అంచనాలు నెలకొనడంతో షూటింగ్ ను శరవేగంగా చేస్తుంది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి ఫారెస్ట్ లో జరుపుకుంది. తాజా ఈ చిత్ర యూనిట్ ఈ నెల 21 నుంచి రాజస్థాన్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. ఇందులో భాగంగా బాలకృష్ణ, ఇతర తారాగణంపై పోరాట ఘట్టాలు, టాకీ సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. అందుకోసం ఇప్పటికే రాజస్థాన్ బయల్దేరింది చిత్రబృందం. మూడు డిఫరెంట్ లుక్స్ లో బాలకృష్ణ(Balakrishna) కనిపించబోయే ఈ సినిమాలో… కథ, కథనం, సినేరియా కొత్తగా ఉంటుందని, అభిమానులు పండుగ చేసుకునేలా బాలకృష్ణ కేరక్టరైజేషన్ ఉంటుందని దర్శకుడు బాబీ చెబుతున్నారు. నెల రోజులపాటు ఈ షెడ్యూల్ సాగుతుందని తెలుస్తోంది. యాక్షన్ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా విజయ్ కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read : Janhvi Kapoor: ఫుడ్ పాయిజనింగ్ తో ఆసుపత్రిలో చేరిన జాన్వీ కపూర్ !