Balakrishna : నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో బాబీ దర్శకత్వం వహించిన డాకూ మహారాజ్ ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాలకు మించి సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ప్రధానంగా నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) మరోసారి తనదైన మార్క్ తో సినిమాకు ప్రాణం పోశాడు. కేవలం మాస్ అప్పీల్ ను తెర మీద ప్రదర్శించే దమ్మున్న డైరెక్టర్ గా పేరు పొందిన బోయపాటి శ్రీనివాస్ కు మించి దర్శకుడు బాబీ బాలయ్యను తెరపై విశ్వ రూపం ప్రదర్శించేలా చేశాడు.
Hero Balakrishna ‘Daaku Maharaaj’ Updates
సంక్రాంతి పండుగ సందర్బంగా మూడు భారీ సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో రామ్ చరణ్ , కియారా అద్వానీ కలిసి నటించిన శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ సక్సెస్ అందుకోగా ఆ తర్వాత విడుదలైన డాకూ మహారాజ్ సూపర్ డూపర్ హిట్ అందుకుంది.
మొత్తం సినిమాను తానై నడిపించాడు నందమూరి నట సింహం. ఆయనకు తోడుగా ముగ్గురు ముద్దు గుమ్మలు శ్రద్దా శ్రీనివాస్ , ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ నటించారు. ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. మొత్తంగా ఎక్కడా తగ్గకుండా దర్శకుడు బాబీ బాలయ్య కెరీర్ లోనే మరిచి పోలేని సినిమాను అందించాడు.
గతంలో తను నటించిన సినిమాలకు మించి భారీ కలెక్షన్లు రాబడుతోంది డాకూ మహారాజ్.
Also Read : Hero Balayya-Daaku Maharaaj : డాకూ మహారాజ్ సూపర్ హిట్