Balakrishna- Big Boss-9 :బిగ్ బాస్ తెలుగు 9కి బాలకృష్ణ హోస్ట్ ..?

త‌ప్పుకోనున్న స్టార్ హీరో అక్కినేని నాగార్జున

Big Boss : అటు న‌టుడిగా, ఇటు హోస్ట్ గా కీ రోల్ పోషిస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ తెలుగు పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్ బాస్(Big Boss) కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారా. అవున‌నే స‌మాధానం వ‌స్తోంది బుల్లితెర నుంచి. ఇప్ప‌టికే ఈ వార్త ప్ర‌చారం పెద్ద ఎత్తున కొన‌సాగుతోంది. ఆహాలో అన్ స్టాప‌బుల్ షోతో బిగ్ పాపుల‌ర్ యాంక‌ర్ గా అవ‌త‌రించారు బాల‌య్య‌. ఈ షో రీజిన‌ల్ షోల‌లో దేశ వ్యాప్తంగా నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. దీనికి కార‌ణం బాల‌కృష్ణ ఇస్తున్న ప్ర‌జెంటేష‌న్. దీంతో త‌న‌నే కంటిన్యూగా చేస్తూ వ‌స్తోంది ఆహా మేనేజ్ మెంట్.

Balakrishna As a Big Boss 9 Host

ఇక పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం అగ్ర నటుడు అక్కినేని నాగార్జున బిజీగా ఉన్న షెడ్యూల్ కారణంగా ఫ్రాంచైజీ నుండి నిష్క్రమించవచ్చున‌ని స‌మాచారం, ఇందులో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ, బాల‌కృష్ణ‌ను క‌న్ ఫ‌ర్మ్ చేసిన‌ట్లు టాక్. హోస్ట్ ప‌రంగా చూస్తే ఇటు నాగ్ అటు బాల‌య్య ఇద్ద‌రూ పోటీ ప‌డుతూ వ‌చ్చారు. న‌ట‌నా ప‌రంగా బాల‌కృష్ణ ఓ రేంజ్ లో ముందు వ‌రుస‌లో కొన‌సాగుతున్నారు.

త‌ను సినిమాల ప‌రంగా ఫుల్ బిజీగా మారి పోయారు. వ‌రుస సినిమాల విజ‌యంతో హ్యాట్రిక్ కొట్టారు. గ‌త ఏడాది అఖండ‌, భ‌గ‌వంత్ కేస‌రి సూప‌ర్ స‌క్సెస్ కాగా ఈ ఏడాది రిలీజ్ అయిన డాకు మ‌హారాజ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ఏకంగా రూ. 130 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ప్ర‌స్తుతం త‌ను అఖండ తాండ‌వం సీక్వెల్ మూవీలో న‌టిస్తున్నాడు.

ఇక షో విష‌యానికి వ‌స్తే నాగార్జునను తీసి వేశార‌ని, నంద‌మూరి న‌ట సింహం నందమూరి బాల‌కృష్ణ‌ను ఎంపిక చేశార‌ని, కేవ‌లం అనౌన్స్ చేయ‌డ‌మే మిగిలి ఉందంటున్నారు సినీ, బుల్లితెర క్రిటిక్స్. ఒక‌వేళ అదే గ‌నుక నిజ‌మైతే బాల‌య్య బిగ్ బాస్ షోకి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ కానున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : Popular Actress-Neena Gupta : 99 శాతం మ‌హిళ‌ల‌కు సెక్స్ గురించి తెలియ‌దు

Balakrishnabig bossUpdatesViral
Comments (0)
Add Comment