Balakrishna: దమ్ము – ధైర్యంకు కేరాఫ్ నందమూరి బ్లడ్

దమ్ము - ధైర్యంకు కేరాఫ్ నందమూరి బ్లడ్ అంటున్న బాలయ్య

దమ్ము – ధైర్యంకు కేరాఫ్ నందమూరి బ్లడ్ అంటున్న బాలయ్య

Balakrishna : అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ… దమ్ము – ధైర్యంకు కేరాఫ్ నందమూరి బ్లడ్ అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. “వైవిధ్యమైన పాత్రల్ని చేసే దమ్ము, ధైర్యం, నమ్మకం మా నాన్న నుంచి నాకు వచ్చిన వారసత్వం. నేను మూడు తరాలుగా ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నానంటే నా పూర్వజన్మ సుకృతం” అన్నారు నందమూరి బాలకృష్ణ(Balakrishna). అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్, శ్రీ లీల ముఖ్య ప్రాత్రల్లో సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’.

హైదరాబాద్‌ వేదిగా గురువారం రాత్రి నిర్వహించిన ‘భగవంత్‌ కేసరి’ విజయోత్సవం వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథులు కె.రాఘవేంద్రరావు, అంబికా కృష్ణ మరియు చిత్ర యూనిట్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సక్సెస్ టిక్కెట్ ని ఆవిష్కరించిన బాలకృష్ణ(Balakrishna)… తెలుగు ప్రేక్షకుల అభిలాష, అభిరుచి ప్రత్యేకమైనది, వారు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు. వాళ్ళు అడిగే వరకు ఆగకుండా మనమే ముందడుగు వేస్తే ఆ ఫలితం ఈ సినిమాలా ఉంటుంది అన్నారు.

Balakrishna – నాకు నేనే పోటీ

నా సినిమాలోని పాత్రల కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడుతున్నారు. నిర్మాతలకి నాపైన ఉన్న నమ్మకం, దర్శకులు నన్ను మలిచే కోణం, రచయితలు నాతో పలికించే మాటలు, వీటన్నిటి ఫలితమే ఈ వరుస విజయ పరంపర. ‘అఖండ,’ ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్‌ కేసరి’… ఇవన్నీ నాకు సవాల్‌ విసిరిన సినిమాలే. నా సినిమాలకి నా సినిమాలే పోటీ. బాలకృష్ణ(Balakrishna) సినిమా అంటే షడ్రుచులు ఉండాలి. అలాంటి సినిమాని ‘భగవంత్‌ కేసరి’ తో అనిల్‌ రావిపూడి ఇచ్చారు. ఒక మంచి సందేశం ఇస్తున్నాం అన్నప్పుడు దేనికైనా సిద్ధపడాలి. అందుకే నేను చిచ్చాగా నటించా. అలాంటప్పుడే మనం చెప్పింది ప్రజల్లోకి బలంగా వెళుతుంది. సినిమాకి మించిన బలమైన మాధ్యమం మరొకటి లేదు. అందుకే నా బాధ్యతగా స్వీకరించి కథ చెప్పిన వెంటనే చేద్దామని అంగీకారం తెలిపా. నిర్మాతలు మంచి సినిమా చేయాలనే పరిశ్రమలోకి వచ్చారు. హిందీలో కూడా ఈ సినిమా డబ్‌ అవుతోంది. తొలిసారి హిందీలో డబ్బింగ్‌ చెప్పాను. ప్రయోగం చేయడం నాన్న గారి నుంచే నాకు అలవాటు. తెలుగువాళ్ల సత్తా ఈ సినిమా నిరూపిస్తుంది’’ అన్నారు.

 

ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘ఇందులో బాలకృష్ణని చూసినప్పుడు నాకు ఎన్టీఆర్‌ గుర్తొచ్చారు. విజ్జి పాప తన గురించి మాట్లాడే సన్నివేశంలో చాలా బాగా చేశాడు. బాలయ్య విజయపతాకం ఇలా ఎగురుతూనే ఉండాలి. డ్యాన్స్‌ అయినా, ఫైట్‌ అయినా, సెంటిమెంట్‌ సన్నివేశాలైనా శ్రీలీల అవలీలగా చేస్తుంది. అనిల్‌ అన్ని రకాల సినిమాలూ చేస్తున్నాడు అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ మాట్లాడుతూ ‘‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్‌ కేసరి’… బాలకృష్ణతో హ్యాట్రిక్‌ కొట్టానన్న ఆనందంలో ఉన్నాను. ఈ మూడు సినిమాలు నాకు ప్రత్యేకం అన్నారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ ‘‘ఇలాంటి పాత్రల్ని చేయగలుగుతాననే నమ్మకాన్ని పెంచిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’. నా చిచ్చాని మిస్‌ అవుతున్నా’’ అన్నారు.

 

వరల్డ్ కప్ లో భారత్, టాలీవుడ్ లో బాలయ్య

ఈ విజయోత్సవ వేడుల్లో భాగంగా దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘‘ఆరేళ్ల నుంచి అరవయ్యేళ్ల వరకు అందరూ కలిసి కుటుంబ సమేతంగా చూస్తున్న సినిమా ‘భగవంత్‌ కేసరి’. ఇది నా కెరీర్‌లోనే గొప్ప సినిమా. ప్రపంచకప్‌లో భారత్‌ జట్టు ఎంత ఫామ్‌లో ఉందో, బాలయ్యబాబు అంత ఫామ్‌లో ఉన్నారు. ఈ విజయపరంపర ఇలాగే కొనసాగాలి. అవార్డుల గురించి నాకు పెద్దగా తెలియదు. వాటికి మనసుంటే బాలకృష్ణ, శ్రీలీల దగ్గరికి రావాలి. అంత బాగా వీరు నటించారన్నారు.

Also Read : Arya: ‘The Village’ web series

BalakrishnaBhagavanth Kesarisrileela
Comments (0)
Add Comment