Balakrishna : అమరావతి – నిమ్మకూరులో సందడి చేశారు నటుడు బాలకృష్ణ. తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తండ్రి స్వగ్రామంలో బంధువులు, గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తన తండ్రికి త్వరలోనే భారత రత్న పురస్కారం దక్కడం ఖాయమన్నారు. ఆయన తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. గత కొంత కాలం నుంచి ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది.
Balakrishna Comment
ఈ సందర్బంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. తనకు పద్మ భూషణ్ అవార్డు రావడం పట్ల ఆనందంగా ఉందన్నారు. ఈ పురస్కారం మీ అందరికీ అంకితం ఇస్తున్నానని అన్నారు. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవ చేస్తున్నామని చెప్పారు. ఏపీలో కూడా ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించామని, దాతలు సాయం చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు నందమూరి బాలకృష్ణ.
ఇక తన తండ్రి దివంగత సీఎం నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకు వచ్చిన ఘనత తన తండ్రికే దక్కుతుందన్నారు. దేశంలో ఏ నాయకుడు తీసుకురాని సంక్షేమ పథకాలు తీసుకు రాలేదన్నారు. ఇప్పటికీ ఎన్టీఆర్ సజీవంగా పేదల గుండెలలో ఉన్నారని చెప్పారు బాలకృష్ణ.