Aditya 369 : నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ లో మరిచి పోలేని చిత్రం ఆదిత్య 369 చిత్రం. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఊహించని రీతిలో సక్సెస్ గా నిలిచింది. సంగీత పరంగా ప్రేక్షకులను మరిచి పోయేలా చేసింది. ప్రత్యేకించి టేకింగ్, మేకింగ్ ప్రతి ఒక్కరినీ విస్తు గొలిపేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పటికీ ఎప్పటికీ సినిమా రంగంలోకి రావాలని అనుకునే వాళ్లకు, ప్రత్యేకించి ఎలా నటించాలనే దానిపై ఓ పుస్తకంగా ఈ చిత్రం ఉపయోగ పడుతుందని ఆ మధ్యన ఓ సినీ దర్శకుడు పేర్కొన్నాడు.
Aditya 369 Re-release
టాలీవుడ్ లో మరిచి పోలేని సినిమాలలో సాగర సంగమం ఒక ఎత్తయితే ఆదిత్య 369(Aditya 369) మరోటి. పూర్తిగా ఎంటర్ టైన్మెంట్ జానర్ లో ఉన్న బాలకృష్ణకు మంచి పాత్ర దక్కేలా చేశారు. అందుకే ఎప్పుడు తన సినీ రంగం గురించి చెప్పినప్పుడల్లా ఆదిత్య 369 చిత్రం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వస్తారు. ఇది ఆయన ప్రత్యేకత. తాను ఎల్లప్పటికీ సింగీతం శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటానని పేర్కొన్నారు. తాజాగా ఈ మూవీ గురించి కీలక అప్ డేట్ వచ్చేసింది.
గతంలో సూపర్ హిట్ గా నిలిచిన మూవీస్ ను తిరిగి ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ప్రత్యేకించి తెలుగు వారు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. ఆదిత్య 369 చిత్రం విజయవంతం కావడానికి దర్శకుడి ప్రతిభ ఒక కారణమైతే , బాలకృష్ణ అద్భుత నటన, అంతకు మించి సంగీత దిగ్గజం మ్యాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం ఈ మూవీ సక్సెస్ కు అదనంగా తోడైంది. ఇదిలా ఉండగా మూవీ లవర్స్ కు ఖుష్ కబర్ చెప్పారు మూవీ మేకర్స్. వచ్చే నెల ఏప్రిల్ 11న రీ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
Also Read : Hero Sheraz Mehdi Movie : 21న ఓ అందాల రాక్షసి రిలీజ్