Balagam Venu : బలగం దర్శకుడు వేణు కొత్త సినిమాపై కీలక అప్డేట్

ఒక్క టైటిల్‌ తప్ప ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం...

Balagam Venu : కమెడియన్‌ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘బలగం’ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చినన సినిమాగా వచ్చిన ఈ మూవీ అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. తెలంగాణ పల్లెల్లోని కుటుంబాల మధ్య జరిగే గొడవలను ఒక చావు చుట్టూ అల్లిన విధానం ప్రేక్షకులను ఫిదా చేసింది. కలెక్షన్లతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సైతం ఈ సినిమా సొంతం చేసుకుంది. ప్రియదర్శి, కావ్య జంటగా తెరకెక్కిన ఈ సినిమా సరికొత్త ఒరవడిని సృష్టించిందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టి దర్శకుడు వేణుపై పడింది. వేణు(Balagam Venu) నుంచి వచ్చే రెండో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. బలగం లాంటి మూవీ తర్వాత వేణు ఎలాంటి మూవీలో నటించనున్నాడని అందరి దృష్టి పడింది. అయితే వేణు తర్వాతి చిత్రాన్ని ఎల్లమ్మ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నట్లు ఇది వరకే ప్రకటించారు. టైటిల్‌తోనే సినిమాపై అంచనాఉల పెరిగిపోయాయి.

Balagam Venu Movies Update

ఈ సినిమాకు కూడా దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇటీవల ఒక మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న వేణుని నిర్మాత దిల్‌రాజు.. ఎల్లమ్మ ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించారు. అయితే దానికి వేణు(Balagam Venu) బదులిస్తూ.. ‘అంతా మీ చేతుల్లోనఏ ఉంది సార్‌అంటూ, మీరు ఇప్పుడు మొద‌లుపెట్ట‌మ‌న్నా స్టార్ట్ చేస్తాను. నవంబ‌ర్ నుంచి స్టార్ట్ చేద్దామా అని అడుగ‌గా.. వ‌ద్దు సామీ ఫిబ్ర‌వ‌రి నుంచి స్టార్ట్ చేద్దాం అంటూ దిల్ రాజు బదులిచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

దీంతో ఎట్టకేలకు ఎల్లమ్మ మూవీ నవంబర్‌ నుంచి ప్రారంభం కానుందని క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే ఎల్లమ్మ సినిమాలో హీరో ఎవరనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. తొలుత ఈ సినిమాలో నాని హీరోగా నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత డేట్స్‌ అడ్జెస్ట్‌ కానీ నేపథ్యంలో నాని ఈ సినిమా నుంచి తప్పుు్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇందులో ఈ సినిమాను హీరో నితిన్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్టోరీ నచ్చడంతో నితిన్‌ సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్‌ నడుస్తోంది. మరి ఇంతకీ ఎల్లమ్మలో ఎవరు నటించనున్నారు.? అసలు ఈ సినిమా కథేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read : Vishwambhara : నెట్టింట దూసుకుపోతున్న మెగాస్టార్ విశ్వంభర టీజర్

MoviesUpdatesVenuViral
Comments (0)
Add Comment