“డ్యూయెట్” గా వస్తున్న బేబీ హీరో ఆనంద్
బేబీ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభమయింది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ శిష్యుడు “మిథున్ వరదరాజ కృష్ణన్” దర్శకత్వం వహిస్తున్న”డ్యూయెట్” సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోజ్ లో వైభవంగా జరిగింది. రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కేఈ జ్ణానవేల్ రాజా నిర్మించగా మధుర శ్రీధర్ రెడ్డి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ, దర్శకులు చందూ మొండేటి, హరీష్ శంకర్, హీరో సత్యదేవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫస్ట్ షాట్ కు దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం వహించగా, ఆనంద్ దేవరకొండ తల్లిదండ్రులు గోవర్ధన్ దేవరకొండ, మాధవి దేవరకొండ కెమరా స్విచ్ఛాన్ చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు మిథున్ వరదరాజ కృష్ణన్ మాట్లాడుతూ డ్యూయెట్ సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉందన్నారు. మంచి లవ్ స్టోరీను ఆనంద్ మేనరిజంకు తగ్గట్టుగా తెరకెక్కించనున్నట్లు ఆయన తెలిపారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ… ఈ మూవీకు నన్ను సెలక్ట్ చేసినందుకు నిర్మాతలు కేఈ జ్ణానవేల్ రాజా, మధుర శ్రీధర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. మా టీం అంతా కలిసి ఒక మంచి సినిమా చేయబోతున్నాం దానికి సహకారం అందిస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.
నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ… తమిళంలో సూర్య, కార్తీతో సినిమాలు చేసిన నేను తెలుగులో హీరో విజయ్ దేవరకొండతో నోటా సినిమా చేసాను. నోటా సినిమా సమయం నుండి నాకు ఆనంద్ తో పరిచయం ఉంది. దర్శకుడు మిథున్ చెప్పిన స్టోరీకు నేను ఎమోషనల్ అయ్యారు. ఇది ఆనంద్ మేనరిజానికి సరిపోయే చిత్రం అని నమ్మి సినిమాను ప్రారంభించాం. వారం రోజుల్లో ఫస్ట్ షెడ్యూట్ స్టార్ట్ చేస్తాం. డ్యూయెట్ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది అన్నారు.