Shobu Yarlagadda : బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ వాట్సాప్ హ్యాక్

నా వాట్సాప్‌ ఖాతా హ్యాక్‌ చేయబడింది. నా ఖాతా హ్యాకర్‌ కంట్రోల్‌లో ఉంది...

Shobu Yarlagadda : ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ వాట్సప్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్‌ వేదికగా తెలిపారు. తన అకౌంట్‌ను తప్పుడు పిన్‌ ఎంటర్‌ చేసిన కారణంగా 12 గంటలపాటు తిరిగి లాగిన్‌ కాలేరని మెసేజ్‌ వస్తుందని ఆయన అన్నారు. ఈ గ్యాప్‌లో తన వాట్సప్‌ అకౌంట్‌తో తన పరిచయస్తులను మోసం చేేస అవకాశం ఉందని, అంతా అప్రమత్తంగా ఉండాలని శోభూ(Sobhu Yarlagadda) విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ఆయన మెటా, వాట్సప్‌ కంపెనీలను ట్యాగ్‌ చేసి సమస్య పరిష్కరించాలని కోరారు.

Shobu Yarlagadda Whats app Hacked

“నా వాట్సాప్‌ ఖాతా హ్యాక్‌ చేయబడింది. నా ఖాతా హ్యాకర్‌ కంట్రోల్‌లో ఉంది. అంతకంటే భయంకరమైన విషయం ఏమిటంటే.. వాట్సప్‌ను నేను మరో 12 గంటల పాటు తిరిగి లాగిన్‌ కావడానికి కుదరదు. దీనికి కారణం.. నేను చాలాసార్లు రాంగ్‌ పిన్‌ ఎంటర్‌ చేశాను. ఈ సమయంలో హ్యాకర్స్‌ నా కాంటాక్ట్‌లో ఉన్న చాలా మంది వ్యక్తులను మోసం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు నా వాట్సాప్‌ను ఉపయోగించే ఛాన్స్‌ లేదు. దయచేసి నా వాట్సాప్‌ సమస్యకు ఏదైనా దారి చూపించండి అంటూ మెటా మరియు వాట్సప్‌ను ట్యాగ్‌ చేశారు. దీనిపై అవగాహన కల్పించిన వారికి శోభు కృతజ్ఞతలు తెలిపారు. అంత పెద్ద బాహుబలి తీసిన మీరు ఇంత చిన్న తప్పు ఎలా చేశారంటూ ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.

Also Read : Sandeep Weds Chandini : నటి చాందినీ రావును పెళ్లాడిన కలర్ ఫోటో దర్శకుడు

BreakingUpdatesViral
Comments (0)
Add Comment