Ayesha Khan: యూత్ ను ఊపేస్తున్న అయేషా ఖాన్ !

యూత్ ను ఊపేస్తున్న అయేషా ఖాన్ !

Ayesha Khan: సినిమా ఇండస్ట్రీలో హీరోలు స్టార్ అవ్వాలంటే ఒక్క శుక్రవారం కావాలి… అదే స్టార్ హీరోయిన్ అవ్వాలంటే ఒక్క నిమిషం వీడియో చాలు. ప్రస్తుతం అయేషా ఖాన్ అనే ముంబై బ్యూటీను చూస్తే ఇది అక్షరాలా నిజమనిపిస్తోంది. ఆమె చేసిన మొద‌టి సినిమా ట్రైల‌ర్‌ లో క‌నిపించిన రెండు సెక‌న్ల వీడియోతో ఓవ‌ర్ నైట్‌లో యూత్ క‌ల‌ల రాణిగా మారింది. ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల‌ యూత్‌ ను ఒక ఊపు ఊపేస్తుంది. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా వెతుకుతున్న పేరేవ‌రిదైనా ఉందా అంటే ఈ ముంబై ముద్దుగుమ్మ‌ అయేషా ఖాన్(Ayesha Khan) దే అయి ఉంటుంది. అంత‌లా ఆ పాటతో ఈ అమ్మ‌డు కుర్ర‌కారును డిస్ట‌ర్బ్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమెకు పెరుగున్న ఫాలోయింగ్ చూస్తుంటే కొంత కాలం ఈమె టాలీవుడ్‌ ను ఊపేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Ayesha Khan Movie Updates

ఇక అయేషా ఖాన్ పూర్తి వివరాల్లోకి వెళితే… 2020లో వ‌చ్చిన హిందీ సిరీస్ బాల్ వీర్‌ లో చిన్న పాత్ర‌లో క‌నిపించిన అయేషా ఖాన్… ఆ త‌ర్వాత ఏకంగా విశ్వ‌క్ సేన్ గెస్ట్ రోల్ చేసిన ముఖ‌చిత్రం సినిమాలో రెండో హీరోయిన్‌గా టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2023 లో స్టార్ట్ అయిన హిందీ బిగ్‌ బాస్ 17 లో కంటెస్టెంట్‌ గా జాయిన్ అయి ఓ మోస్త‌రు గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌రువాత మ‌ళ్లీ తెలుగులో ఓం భీం భుష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ఒక్క‌సారిగా టాలీవుడ్‌ను షేక్ చేసింది.

ముఖ్యంగా ఓం భీం భుష్ సినిమా విడుద‌ల‌కు ముందు రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌లో ప‌ల్లెటూరి ప‌డుచు వేషంలో హాట్ లుక్‌ లో రెండు మూడు సెక‌న్లు మాత్ర‌మే క‌నిపించి అంద‌రి దృష్టిని త‌న వైపు తిప్పుకునేలా చేసింది. ఆపై సినిమా విడుద‌లయయ్యాక అందులో అయేషా గ్లామ‌ర్ కు కుర్ర‌కారు ఫిదా అయిపోయారు. ఆ వెంట‌నే విశ్వ‌క్ సేన్ కొత్త సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ సినిమా నుంచి విడుద‌లైన పాట ఆమె క్రేజ్‌ను మ‌రింత‌గా పెంచేశాయి. ప‌డుకున్న ముస‌ళోల్లు సైతం ఊరుకులు పెట్టించేలా ఈ అమ్మడు అ పాట‌లో త‌న అందాల విందును పంచింది. దీంతో ఇప్పుడు ఈ పాట యూ ట్యూబ్‌లో దూసుకుపోతుండ‌గా సోష‌ల్ మీడియాల్లోనూ ఈ పాటే ట్రెండింగ్‌లో ఉంది.

Also Read : Siren OTT : ఫిబ్రవరి 16న థియేటర్లలోకి వచ్చిన ‘సైరన్’…ఇక ఓటీటీలో అలరించనుంది

Ayesha KhanOm Bheem Bush
Comments (0)
Add Comment