Avatar-3: ప్రపంచ చలన చిత్ర పరిశ్రమలో ఓ సంచలనం హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్. టైటానిక్, టెర్మినేటర్, అవతార్ వంటి అద్భుత ప్రపంచాల సృష్టికర్త జేమ్స్ కామెరూన్. అవతార్ ద్వారా పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్లుచెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో అందరినీ కట్టిపడేశారు దర్శకుడు జేమ్స్. దానికి సీక్వెల్ గా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’తో ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు దర్శకుడు జేమ్స్. ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీనితో ఈ ఫ్రాంచైజీలో రానున్న మూడో భాగాన్ని 2025లో విడుదల చేస్తామని దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రకటించారు. ఇటీవల ఓ హాలీవుడ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అవతార్ 3(Avatar-3)’ సినిమా గురించి పలు ఆశక్తికరమైన విషయాలను ఆయన వెల్లడించారు.
Avatar-3 – కథ, కథనం, విజువల్స్ సమాహారం ‘అవతార్ 3’
‘అవతార్’, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ తరువాత ఈ ప్రాంబైజీలో తెరకెక్కబోయే ‘అవతార్ 3’లో ఎక్కువగా పాత్రలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. మంచి కథ, కథనంతో పాటు భారీ విజువల్స్‌తో అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. 2025 డిసెంబరు 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోయే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అతి త్వరలో విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అంచనాలకు మించిన లైవ్-యాక్షన్ తో మరో కొత్త ప్రపంచాన్ని భిన్నమైన కథనం, విభిన్నమైన పాత్రలతో ‘అవతార్ 3’ ను రూపొందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాదు ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’లో కనిపించిన కేట్ విన్స్‌లెట్ చేసిన రోనాల్ పాత్రను అవతార్ 3లో మరింత పొడిగించామని ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా ఆమె శిక్షణ తీసుకుంటుంది’ అని ఆయన అన్నారు. అవతార్ ఫ్రాంచైజీలో రానున్న ‘అవతార్ 4’ ను 2029లో, చివరిగా రానున్న ‘అవతార్ 5’ ను డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఆ చిత్రబృందం ప్రకటించింది. దీనితో ‘అవతార్ 3’ పై రోజురోజుకి అంచానాలు పెరిగిపోతున్నాయి.
Also Read : Hero Raviteja: ‘మిస్టర్ బచ్చన్’ గా మాస్ మహారాజ్