Avantika Vandanapu: చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి హీరోలు, హీరోయిన్లు అయిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. కాని టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం అయి… హాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది అవంతిక వందనపు(Avantika Vandanapu). సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్ కి పరిచయమైన అవంతిక… ఆ తరువాత ‘ప్రేమమ్’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బాలకృష్ణుడు’, ‘అజ్ఞాతవాసి’ సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో పెరిగిన అవంతిక… ఓ టీవీ ఛానల్ లో నిర్వహించిన డ్యాన్స్ ప్రోగ్రామ్ లో రన్నరప్ గా నిలిచి టాలీవుడ్ లో అడుగుపెట్టింది.
Avantika Vandanapu Viral
‘బ్రహ్మోత్సవం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబును ఇంటర్వూ చేసి అందరికీ ఆకట్టుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన అవంతిక… ఆ తరువాత పలు మూవీ ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించింది. అయితే ఇప్పుడు ఈమె ఒక్కసారిగా హాలీవుడ్ లో మెరిసి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ప్రస్తుతం అవంతికకు సంబంధించిన తెలుగు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమాలతో పాటు పలు ప్రకటనల్లో కనిపించిన అవంతిక… ఇప్పుడు హాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. తాజాగా ‘మీన్ గర్ల్స్-ది మ్యూజికల్’ అనే హాలీవుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీన్ కామెడీ సినిమాగా జనవరి 12న విడుదలైన ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిడంతోపాటు తన నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఓ పాటలో ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయని… అవంతికను ప్రశంసిస్తూ సినీ ప్రముఖులు పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన మరో రెండు హాలీవుడ్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు మరో మూడు వెబ్ సిరీస్ ల్లోనూ అవంతిక నటిస్తోంది. దీనితో ఒకప్పటి టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్… ఏకంగా హాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.
Also Read : Saindhav Collections : ఊహించని రీతిలో వసూళ్ల మోత మోగించిన ‘సైంధవ్’