Allu Arjun : తమిళ సూపర్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) చిత్రం కన్ ఫర్మ్ అయ్యింది. దీంతో అంచనాలు మరింత పెరిగాయి. దేశంలో ఏ హీరో అందుకోని విధంగా భారీ ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. బన్నీ, అట్లీ కాంబినేషన్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే టాప్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు పొందాడు అట్లీ కుమార్. తను దళపతి విజయ్ తో తీసిన మూవీ ఇండియాను షేక్ చేసింది. ఇదే సమయంలో బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో తీసిన జవాన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టింది. తను ఏ మూవీ తీసినా అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Allu Arjun-Atlee Movie Updates
కాగా ఇండియాలో భారీ చిత్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందిన సన్ ఇంటర్నేషనల్ మూవీ మేకర్స్ బన్నీ, అట్లీ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో నటించేందుకు అల్లు అర్జున్ ఏకంగా రూ. 150 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి నిర్మాతలు రివీల్ చేయలేదు. తాజాగా మరో సంచలనానికి తెర తీశాడు దర్శకుడు అట్లీ. అధికారికంగా ప్రకటించేందుకు గాను అమెరికాలో వీడియోను చిత్రీకరించడం విశేషం.
అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన టేకింగ్, మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక బన్నీ దర్శకుల హీరో. తనను ఎలా వాడుకుంటే అలా నటించేందుకు సిద్దంగా ఉంటాడు. తనతో పాటు టాలీవుడ్ లో మరికొందరు హీరోలు ఉన్నారు. వారిలో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు. ప్రస్తుతం అల్లు అర్జున్ విషయానికి వస్తే పలువురు దర్శకులతో తను చర్చల్లో ఉన్నాడు. అట్లీతో పాటు పూర్తిగా పౌరాణిక పాత్రలో త్రివిక్రమ్ తీసే సినిమాలో నటించనున్నాడు.
Also Read : Mad Square Sensational : వినోద భరితం మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్ల వర్షం