Atlee Direct : బ‌న్నీతో అట్లీ నెక్ట్స్ మూవీ

పుష్ప త‌ర్వాత షూటింగ్

Atlee Direct : పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ తో క్రియేటివ్, డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ సినిమా చేయ‌బోతున్నారు. ఈ వార్త సినిమా రంగంలో క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే పుష్ప ది రైజ్ తో ఒక్క‌సారిగా త‌నేమిటూ ప్రూవ్ చేసుకున్నాడు బ‌న్నీ.

Atlee Direct Next Movie

ఇక ఈ చిత్రం స‌క్సెస్ తో డైరెక్ట‌ర్ సుకుమార్ సీక్వెల్ గా పుష్ప‌2 తీస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్ డేట్ కూడా ఇచ్చారు. వ‌చ్చే ఏడాది 2024 ఆగ‌స్టు 15న రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్.

పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా సాగుతోంది. ఈ త‌రుణంలో తాజా అప్ డేట్ వ‌చ్చింది. డైన‌మిక్ హీరో అల్లు అర్జున్ తో త‌మిళ సినీ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్(Atlee Kumar) సినిమా తీయ‌బోతున్నాడ‌ని, ఇప్ప‌టికే త‌ను తీసే చిత్రానికి సంబంధించి క‌థ కూడా చెప్పేశాడ‌ని టాక్. అట్లీ కుమార్ చెప్పిన స్టోరీకి బ‌న్నీ ఓకే కూడా చెప్పేశాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే అట్లీ కుమార్ జోసెఫ్ విజ‌య్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు తీశాడు. తాజాగా బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారుక్ ఖాన్ , న‌య‌న‌తార‌, దీపికా ప‌దుకొనే, విజ‌య్ సేతుప‌తితో క‌లిసి జ‌వాన్ తీశాడు. అది ఇప్పుడు రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన 5 రోజుల‌కే రూ. 538 కోట్లు కొల్ల‌గొట్టింది. రాబోయే బ‌న్నీ మూవీ ఇంకెలా ఉండబోతుంద‌నేది వేచి చూడాలి.

Also Read : Preity Zinta Priyanka Chopra Viral : ప్రియాంక‌..ప్రీతి జింటా వైర‌ల్

Comments (0)
Add Comment