Shivam Bhaje Movie : యాక్షన్ నేపథ్యంలో వస్తున్న అశ్విన్ ‘శివమ్ భజే’ మూవీ

ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ గా ఈ ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది...

Shivam Bhaje : అశ్విన్ బాబు ఇంతకు ముందు ‘హిడింబ’ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ‘శివం భజే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఇది యాక్షన్ నేపథ్యంతో కూడుకున్న కథలా అనిపిస్తోంది. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 1న విడుదలవుతోంది. ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ లో కెమికల్ ఇంజనీర్ గా చేస్తున్న అశ్విన్ ఒక కిల్లర్ ని కనిపెట్టడానికి వెళుతూ ఉంటాడు. ఇదే ట్రైలర్ లో చైనా నుండి ప్రమాదం పొంచి వుంది అని కూడా చెప్పారు. దిగంగానా సూర్యవన్సీ ఇందులో కథానాయకురాలు. మహేశ్వర్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాత.

Shivam Bhaje Movie Updates

ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ గా ఈ ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. ఈ సినిమాలో చాలా ట్విస్ట్స్ కూడా వుంటాయని అర్థం అవుతోంది. అశ్విన్ బాబు(Ashwin Babu) పోరాట సన్నివేశాల్లో తనదైన శైలిలో మరోసారి అదరగొట్టబోతున్నాడు అనే విషయం కూడా అర్థం అవుతోంది. అర్బాజ్ ఖాన్ పాత్ర అంతగా రివీల్ చెయ్యలేదు ఎందుకో మరి. ఇంకా ఇందులో హైపర్ ఆది, మురళి శర్మ, బ్రహ్మాజీ, తులసి, అయ్యప్ప శర్మ, షకలక శంకర్, ఇనయ సుల్తానా ఇలా చాలామంది నటీనటులు వున్నారు. ఇది పూర్తి యాక్షన్ నేపథ్యంలో, స్పై లాంటి ఒక సినిమా అనిపిస్తోంది. చైనా ఎటువంటి హాని చేయబోతోంది, అది ఎలా ఆపగలిగారు అనే విషయంపై సినిమా కథ వున్నట్టుగా తెలుస్తోంది.

Also Read : Mega Vs Allu Family : మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ పై వస్తున్న ట్రోలింగ్ కి స్పందించిన హైపర్ ఆది

Ashwin BabuMoviesShivam BhajeTrendingUpdatesViral
Comments (0)
Add Comment