Ashwini Dutt : త్వరలో జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంద్ర సీక్వెల్స్

ఈక్ర‌మంలో నిర్మాత అశ్వినీద‌త్ మాట్లాడుతూ....

Ashwini Dutt : టాలీవుడ్ హిస్ట‌రీలో చెరిగిపోలేని చిత్రం ఇంద్ర‌. ఇటీవ‌లే రీ రీలీజ్ కూడా అయిన ఈ చిత్రం మ‌రోసారి త‌న స్టామినాను చూపిస్తూ అదిరిపోయే క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. అయితే ‘ఇంద్ర’ సినిమా రీ రిలీజ్‌ను పురస్కరించుకుని ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, చిన్ని కృష్ణ‌, సంగీత ద‌ర్శ‌కుడు మణిశ‌ర్మ, ద‌ర్శ‌కుడు గోపాల్, నిర్మాత అశ్వినీద‌త్ రెండు రోజుల క్రితం చిరంజీవిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ వారిని స‌న్మానించి కాసేపు ఇంద్ర షూటింగ్ స‌మ‌యం నాటి విష‌యాల‌ను, క‌ష్టాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా తాజాగా సినిమా రీ రిలీజ్ సంద‌ర్భంగా ఫ్యాన్స్ చేస్తున్న హంగామా గురించి మ‌ట్లాడుకున్నారు.

Ashwini Dutt Comment

ఈక్ర‌మంలో నిర్మాత అశ్వినీద‌త్ మాట్లాడుతూ.. ఇంద్ర‌, జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సినిమాల‌కు సీక్వెల్స్ కావాల‌ని చాలామంది ఎదురు చూస్తున్నార‌ని త‌ప్ప‌నిస‌రిగా వాటి సీక్వెల్స్ వ‌స్తాయ‌ని త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను స‌ద‌రు వైజ‌యంతీ మూవీస్ త‌న యూట్యూబ్‌ ఛానల్ లో పోస్టు చేసింది. ఈ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాను ఓ కుదుపు కుదిపేస్తోంది. అభిమానులు తెగ సంబ‌ర ప‌డిపోతున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Also Read : Bench Life OTT : ఓటీటీ కి సిద్ధమైన మరో కొత్త నిహారిక కొణిదెల వెబ్ సిరీస్ ‘బెంచ్ లైఫ్’

Ashwini DuttChiranjeeviCommentsTrendingUpdatesViral
Comments (0)
Add Comment