Ashrita Shetty: టీమిండియా క్రికెటర్‌ తో విడాకులకు సిద్ధమైన కన్నడ నటి ?

టీమిండియా క్రికెటర్‌ తో విడాకులకు సిద్ధమైన కన్నడ నటి ?

Ashrita Shetty: ప్రముఖ కన్నడ నటి అశ్రిత శెట్టి… టీమిండియా క్రికెటర్‌ మనీశ్‌ పాండేను పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. తమిళ, కన్నడ సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో… అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన మనీశ్ పాండే తో కొంతకాలం డేటింగ్ చేసిన అశ్రిత… 2019లో మూడు ముళ్ల బంధంతో దగ్గరయ్యింది. అయితే ఇటీవల కాలంలో వారి వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ జంట విడాకులకు సిద్ధమైందంటూ ప్రచారం జరుగుతోంది. మనీశ్‌ పాండే- ఆశ్రిత శెట్టి(Ashrita Shetty) సోషల్‌ మీడియాలో తమ పెళ్లి ఫొటోలను తొలగించడం ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది. ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు విడాకుల విషయం నేరుగా చెప్పకుండా… ఇలా ఫొటోలు డిలీట్‌ చేసి సంకేతాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనీశ్‌- ఆశ్రితల విడాకుల గురించి నెట్టింట చర్చ మొదలైంది.

Ashrita Shetty – ఉత్తరాఖండ్‌ అబ్బాయి-కర్ణాటక అమ్మాయి

ఉత్తరాఖండ్‌కు చెందిన మనీశ్‌ పాండే 2015లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 34 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ భారత్‌ తరఫున మొత్తంగా 29 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 566, 709 పరుగులు చేశాడు. మనీశ్‌ పాండేకు జాతీయ జట్టులో ఎక్కువగా అవకాశాలు రాకపోయినా ఐపీఎల్‌లో మాత్రం మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు 171 మ్యాచ్‌లు ఆడిన మనీశ్‌ పాండే 3850 పరుగులు సాధించాడు. ఈ ఏడాది కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ప్రాతినిథ్య వహించాడు. ఐపీఎల్‌-2024లో కేకేఆర్‌ చాంపియన్‌గా నిలవడంలో తన వంతు సాయం చేశాడు.

మరోవైపు.. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఆశ్రిత శెట్టి(Ashrita Shetty) తొలుత మోడల్‌గా రాణించింది. అనంతరం సినీ రంగంలో అడుగుపెట్టింది. తులు భాషలో ‘తెలికెడ బొల్లి’ అనే మూవీతో 2012లో నటిగా అరంగేట్రం చేసింది. అదే విధంగా.. ఉదయం ఎన్‌హెచ్‌4(హీరోయిన్‌గా), ఒరు కన్మియుమ్‌ మూను కలావానికలుమ్‌ వంటి తమిళ సినిమాల్లో కూడా ఆశ్రిత నటించింది. కాగా తమ తమ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మనీశ్‌ పాండే- ఆశ్రిత శెట్టి కొన్నాళ్లపాటు డేటింగ్‌ చేశారు. 2019లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఎప్పటికప్పుడు తమ ఫొటోలను అభిమానులతో పంచుకునే ఈ జంట.. అకస్మాత్తుగా తమ పెళ్లి ఫొటోలు డిలీట్‌ చేసి ఇలా షాకిచ్చారు.

Also Read : Chandini: తన పెళ్లిపై ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి చాందిని !

Ashrita ShettyManesh Pandy
Comments (0)
Add Comment