Ashika Ranganath: ‘మెగా’ ఛాన్స్‌ కొట్టేసిన ఆషికా రంగనాథ్‌ !

‘మెగా’ ఛాన్స్‌ కొట్టేసిన ఆషికా రంగనాథ్‌ !

Ashika Ranganath: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఆశికా రంగనాథ్(Ashika Ranganath) బంపర్‌ ఆఫర్‌ అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ లో అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని సొంతం చేసుకోవడం కోసం అభిమానులు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. ‘అమిగోస్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆషిక… ఆ తర్వాత నాగార్జున సరసన ‘నా సామిరంగ’లో మెరిశారు. తెలుగులో మూడో సినిమానే మెగాస్టార్‌తో చేయనుండటంతో ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Ashika Ranganath…

సోషియో ఫాంటసీ ఫిల్మ్‌గా బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ రూపొందుతోంది. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో చిరంజీవి కనిపించనున్నారు. గతంలో ఆయన నటించిన సినిమాలతో పోలిస్తే… అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ స్థాయిలో ఉండనున్న యాక్షన్ సీక్వెన్స్‌ లు సినిమాకే హైలైట్‌ కానున్నాయి. ఇక ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉండనున్నట్లు ఎప్పటి నుంచో టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో స్టార్‌ హీరోయిన్‌ త్రిష, ఇప్పుడు ఆషికా అధికారికంగా జాయిన్‌ అయ్యారు. సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

గతంలో ‘విశ్వంభర’ గురించి వశిష్ఠ మాట్లాడుతూ.. ఇది పూర్తిస్థాయి ఫాంటసీ జానర్‌ చిత్రమన్నారు. ఇందులో 70శాతం స్పెషల్‌ ఎఫెక్ట్‌ లు ఉంటాయని చెప్పారు. సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి. వీటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించామన్నారు. మామూలుగానే మెగా సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నెలకొంటాయి. దర్శకుడి మాటలతో అవి రెట్టింపయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Amitabh Bachchan: ‘కల్కి’ సినిమా, బుజ్జి వాహనం పై బిగ్ బి అమితాబ్‌ ప్రశంసల జల్లు !

Ashika RanganathMega Star ChiranjeeviViswambhara
Comments (0)
Add Comment