Artiste : జేమ్స్ వాట్ నిర్మాణ సారథ్యంలో రతన్ రిషి దర్శకత్వంలో తీసిన ఆర్టిస్ట్ మూవీకి సంబంధించి అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలోని చూస్తూ చూస్తూ నినే నీవై పోయా అనే పాటను ను విడుదల చేశారు. దర్శకుడు ఈ పాటను నటీ నటులపై చిత్రీకరించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ప్రత్యేకించి యూత్ ను ఇట్టే ఇష్టపడేలా చేస్తుందని చెప్పాడు.
Artiste Movie Song..
ఆర్టిస్ట్ చిత్రంలో క్రిషేక్ పటేల్ ..సంతోష్ కల్వచర్ల కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా సినిమా ప్రమోషన్స్ ను మూవీ మేకర్స్ స్టార్ట్ చేశారు. యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్ గా తెరకెక్కించానని చెప్పాడు రతన్ రిషి.
చూస్తూ చూస్తూ నిన్నే ఉండి పోయా పాటను గోసాల రాంబాబు రాయగా సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు. ఈ పాటను హృద్యంగా పాడాడు కపిల్ కపిలన్. హోలీ పండుగ నేపథ్యంలో దీనిని చిత్రీకరించారు డైరెక్టర్.
ఇక ఈ మూవీలో సత్యం రాజేష్, వినయ్ వర్మ, ప్రభాకర్, సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ఇతర పాత్రలు పోషించారు.
Also Read : Beauty Rashmika Movie : చారిత్రక నేపథ్యం ‘ఛావా’ అద్భుతం