Aishwarya weds Umapathy : యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య వివాహం సోమవారం (జూన్ 10) చెన్నైలోని అంజనస్థ శ్రీ యోగాంజనేయస్వామి మందిరంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇటీవల కోలీవుడ్ స్టార్ కమెడియన్ తంబి రామయ్య తనయుడు, నటుడు ఉమాపతితో ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి పెళ్లిని కూడా ఇరు కుటుంబాల సభ్యులు ఘనంగా నిర్వహించారు.
Aishwarya weds Umapathy Marriage
ఐశ్వర్య అర్జున్ మరియు ఉమాపతి పెళ్లి గురించి. జూన్ 7న హల్దీ వేడుకతో వివాహ వేడుక ప్రారంభమైంది. జూన్ 8న సంగీత్ కార్యక్రమం నిర్వహించగా, జూన్ 10వ తేదీ ఉదయం సినీ తారల సమక్షంలో ఘనంగా వివాహ వేడుక జరిగింది. కాగా, ఐశ్వర్య అర్జున్, ఉమాపతి వివాహ రిసెప్షన్ జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది.
Also Read : Ram Charan : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి గ్లోబల్ స్టార్ కి ఆహ్వానం