Arjundas: అర్జున్‌ దాస్, శివాత్మిక జంట‌గా నటిస్తున్న సినిమా ‘బాంబ్‌’ !

అర్జున్‌ దాస్, శివాత్మిక జంట‌గా నటిస్తున్న సినిమా ‘బాంబ్‌’ !

Arjundas: అనేక చిత్రాల్లో విలన్‌గా అదరగొట్టిన నటుడు అర్జున్‌ దాస్ ఇపుడు హీరోగా బిజీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన నటించిన ‘అనీతి’, ‘రసవాది’ వంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. నిత్యం వైవిధ్య భరితమైన పాత్రలను ఎంచుకుంటూ తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్న పూర్తిస్థాయి హీరోగా మారి, వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘బాంబ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘సిల నేరంగలిల్‌ సిల మణిదర్‌గల్‌’ ఫేం విశాల్‌ వెంకట్‌ దర్శకత్వంలో జీవిత వినోదాన్ని వివరించే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

Arjundas Movie Updates

జెంబ్రియో పిక్చర్స్‌ బ్యానరుపై సుధా సుకుమార్‌ నిర్మించే ఈ సినిమాలో కాళి వెంకట్‌, శివాత్మిక రాజశేఖర్‌, నాజర్‌, అభిరామి, సింగం పులి, బాల శరవణన్‌ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సుధా సుకుమార్‌, సుకుమార్‌ బాలకృష్ణన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ తాజాగా రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా హీరో అర్జున్‌ దాస్‌(Arjundas) మాట్లాడుతూ… ‘‘ఈ సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. నాజర్‌ వంటి పెద్ద నటుడితో కలిసి పని చేస్తున్నాను. సంగీత దర్శకుడు ఇమ్మాన్‌ అభిమానిని నేను. ఆయన సంగీతం అందించడం ఎంతో సంతోషంగా ఉంది. దర్శకుడు మదురై వచ్చి కథ చెప్పారు. అపుడే ఓకే చెప్పాను. దర్శకుడిపై భారం వేసి ఆయనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నాను.నా గ‌త సినిమాను అద‌రించిన‌ట్లే ఈ సినిమాకు కూడా ఆద‌రించాల‌ని కోరారు.

Also Read : Gyaarah Gyaarah: ఓటీటీలోనికి ఫాంట‌సీ ఇన్వెస్టిగేష‌న్‌ థ్రిల్ల‌ర్ గ్యారా గ్యారా !

ArjundasBomb
Comments (0)
Add Comment