Arjun Rampal: బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ సోషల్ మీడియా ఖాతా ఎక్స్(ట్విటర్ అకౌంట్) హ్యాకింగ్ కు గురైంది. ఈ విషయాన్ని నటుడు అర్జున్ రాంపాల్ తన మరో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన ఖాతా నుంచి ఏదైనా పోస్టులు వస్తే స్పందించవద్దని తెలిపారు. దీనిపై తన అభిమానులు సైతం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Arjun Rampal…
కాగా.. అర్జున్ రాంపాల్(Arjun Rampal) చివరిసారిగా ‘క్రాక్’ చిత్రంలో నటించాడు. ప్రస్తుతం సంజయ్ దత్, రణవీర్ సింగ్లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ఆదిత్య ధర్ హెల్మ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం థాయ్లాండ్, బ్యాంకాక్ లలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీ62 బ్యానర్లపై జ్యోతి దేశ్పాండే, లోకేష్ ధర్, ఆదిత్య ధర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన అర్జున్ రాంపాల్… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తున్న హరిహరవీరమల్లు సినిమాలో కూడా నటిస్తున్నారు.
Also Read : Manchu Vishnu: నిరుపేద కళాకారులకు రూ.10 లక్షలు విరాళం ప్రకటించిన మంచు విష్ణు !