Arjun Kapoor : అర్జున్ కపూర్..భూమి పెడ్నేకర్(Bhumi Pednekar)..రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన మేరే హస్బెండ్ కి బీవీ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈనెల 21న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తిగా కామెడీ , ఎంటర్ టైనర్ గా తీర్చి దిద్దాడు దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యాయి. ఉల్లాసం, ఆనందం కలిగించడం పక్కా అంటున్నారు మూవీ మేకర్స్.
Arjun Kapoor-Bhumi Movie Updates
ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటాడనే దానిపై ఉత్కంఠ రేపుతుంది ఈ చిత్రం. ఈ మూవీలో డినో మోరియా, హర్ష్ గుజ్రాల్, శక్తి కపూర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పంచ్ లైన్‌లు, విచిత్రాలు ఈ చిత్రాన్ని పూర్తి పైసా-వసూల్ అనుభవంగా మారుస్తాయని హామీ ఇస్తున్నాయి.
ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో పతి పత్ని ఔర్ వో (2019) , ఖేల్ ఖేల్ మెయిన్ (2024) వంటి చిత్రాలను అందించారు. వాషు భగ్నాని, పూజ ఫిల్మ్స్ సమర్పిస్తున్నారు. వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్‌శిఖా దేశ్‌ముఖ్ నిర్మించారు. ఇదిలా ఉండగా విలాసం కంటే సంతృప్తి అత్యంత ముఖ్యమని చెప్పింది నటి రకుల్ ప్రీత్ సింగ్.
Also Read : Ritu Varma Success :మజాకా మూవీ సక్సెస్ పక్కా